40.2 C
Hyderabad
April 19, 2024 17: 46 PM
Slider విజయనగరం

ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఉత్త‌రాంద్ర వాసి….!

#PoliceDutyMeet

ఇటీవ‌లే ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ తిరుప‌తిలో పొలీస్ డ్యూటీ నిర్వ‌హించింది. ఈ రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ లో  వివిధ రేంజ్ ల నుంచీ మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించి ఆయా జిల్లాలకు చెందిన వీడియోలు, పోటోల‌ను సంబంధింత రేంజ్ లో ప‌ని చేస్తున్న పోలీస్ సిబ్బంది హాజ‌రై ప్ర‌ద‌ర్శించారు.

63వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 1వ పోలీసు డ్యూటి మీట్  లో విశాఖ రేంజ్ అంటే శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం ,విశాఖ జిల్లాల త‌రుపున విజ‌య‌న‌గ‌రంలో ఎస్బీ కేంద్రంలో ఎస్ఐగా ప‌ని చేస్తున్న కృష్ణ వ‌ర్మ బృందానికి అవార్డు వ‌చ్చింది.

రేంజ్ తరుపున రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొన్నఎస్ఐ కృష్ణ వ‌ర్మ‌..గ‌తంలోనూ విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ లోఎస్ఐగా ప‌ని చేస్తున్నారు.కొద్ది నెల‌ల క్రితం  విధుల నుంచీ స‌స్పెండ్ న‌కు గురై మ‌ళ్లీ జాయ‌న్ అయిన ఎస్ఐ కృష్ణ‌వ‌ర్మ‌..స్పెష‌ల్ బ్రాంచ్ ఎస్ఐగా ప‌ని చేస్తున్నారు.

ఇటీవ‌లే రెండోసారి జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించిన సంద‌ర్బంగా మీడియా సెల్ ఇంచార్జిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించి ఉన్న‌తాధికారుల నుంచీ శ‌భాష్ అనిపించుకున్నారు.

అనంత‌రం… తిరుప‌తితో జ‌రిగిన రాష్ట్ర స్థాయిలో తొలి పోలీస్ డ్యూటీ మీట్ కు విజయ‌న‌గ‌రం జిల్లా నుంచీ ఎంపికై వెళ్లిన ఎస్బీ ఎస్ఐ కృష్ణ వ‌ర్మ పాల్గొని…మ‌హిళా సంర‌క్ష‌ణ పోలీసుకు సంబంధించి వీడియోల‌ను, ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు.

ఈ నేప‌ద్యంలో విశాఖ రేంజ్ కు తృతీయ బ‌హుమ‌తి రావ‌డం దాన్ని ఎస్బీ ఎస్ఐ కృష్ణ వర్మ అందుకోవ‌డం జిల్లా పోలీస్ శాఖ‌కే గ‌ర్వ‌కార‌ణం.

Related posts

ఎకానమీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ

Satyam NEWS

నంద్యాల రిపోర్టర్ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు: ఏపి డి‌జి‌పి

Satyam NEWS

వడదెబ్బ తగులుతుంది అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment