27.7 C
Hyderabad
April 26, 2024 04: 08 AM
Slider విజయనగరం

మైనర్ బాలుడి హత్య మిస్టరీని ఛేదించిన విజయనగరం రూరల్ పోలీసులు

#marder case

విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో సుమారు రెండు నెలల క్రితం అదృశ్యమై, హత్య కావింపబడిన బాలుని కేసు మిస్టరీని రూరల్ పోలీసులు చేధించినట్లుగా విజయనగరం డీఎస్పీ అనిల్ మీడియాకు తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే.. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు లత అనే ఆమె విజయనగరం రూరల్ పోలీసు లకు మే నెల 9న ఫిర్యాదు చేస్తూ, తన కుమారుడు బొద్దూరు పవన్ కుమార్ అనే వ్యక్తి పాల పేకెట్లు తెచ్చేందుకుగాను మోటారు సైకిలు పై వెళ్ళి, తిరిగి ఇంటికి రానట్లు తెలపడంతో విజయ నగరం రూరల్ పోలీసులు పవన్ కుమార్  అదృశ్యమైనట్లుగా కేసు నమోదు చేసి, ఆచూకీ తెలుసుకొనేందుకు గాను వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు.

కానీ, సదరు వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా గత నెలలో  సారిక గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో నడుము నుండి పాదం వరకు గల ఒక వ్యక్తి శరీరం నీటిలో తేలియాడుతూ ఉన్నట్లు గా పోలీసులకు సమాచారం రావడంతో, సంఘటనా స్థలంకు విజయనగరం రూరల్ సిఐ, ఎస్ ఐలు, సిబ్బంది చేరుకొని, విచారణ చెయ్యగా, సదరు మృతదేహం పై గల బట్టలను బట్టి, గతంలో అదృశ్యమైన బాలుడు పవన్ కుమార్ మైనర్ గా నిర్ధారించుకున్నారు.

బాలుని అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి, దర్యాప్తు చేపట్టినారు. పోలీసుల విచారణలో హత్య కావింపబడిన పవన్ కుమార్ కు తల్లి లత, చెల్లెలు ఉమా రాజేశ్వరి  ఉన్నట్లు, తండ్రి గతంలోనే మృతి చెందినట్లు, తన తల్లికి పద్మనాభం మండలం చిన్నాపురంకు చెందిన గిడిజాల జగదీష్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు, ఈ విషయమై పవన్ కుమార్ పలుమార్లు జగదీష్ ను ప్రశ్నించినట్లుగా తెలిసింది.

అదే విధంగా సారిక గ్రామంకు చెందిన 33 ఏళ్ల వాలిపల్లి సురేష్ తో పవన్ కుమార్‌కు మంచి స్నేహం ఉన్నట్లు, ఇరువురు కలిసి తిరిగే వారని, ఈ క్రమంలో పవన్ కుమార్ చెల్లెలు మైనర్ అయిన ఉమా రాజేశ్వరి ను ప్రేమించినట్లు, పెండ్లి కూడా చేసుకుంటానని, ఫిర్యాది లతను అడగగా, ఇరువురు మధ్య వయస్సు వ్యత్యాసం, వేరే కులంకు చెందిన కారణంగా పెండ్లి చేసేందుకు పవన్ కుమార్, ఫిర్యాది లత నిరాకరించుట జరిగింది.

వాలిపల్లి సురేష్ తన పెండ్లికి సహకరించాల్సిందిగా గిడిజాల జగదీష్ ను కోరగా, అందుకు జగదీష్ తన అక్రమ సంబంధానికి కూడా పవన్ కుమార్ అడ్డుగా ఉన్నాడని, పవన్ కుమార్ అడ్డు లేకుండా చేస్తేనే వివాహం జరుగుతుందని, ఎవ్వరినైనా చూసి, పవన్ కుమార్‌ను హత్య చేయిస్తే, హత్యకు అయ్యే ఖర్చులో తానే సగం భరిస్తానని సురేష్ తో చెప్పాడు.

దీనితో పవన్ కుమార్‌ను హత్య చేసేందుకు అతని స్నేహితుడు, తన వద్ద పని చేస్తున్న సువ్వాడ శంకరరావు  సహాయంను సురేష్  కోరాడు. అనంతరం, హత్యకు సహకరించేందకు గాను సురేష్ తన వద్ద ట్రాక్టరు డ్రైవరుగా పని చేసే పిట్టా శంకర్  స్నేహితుడు మేకల సోములు ల సహాయం కోరి, పవన్ కుమార్‌ను హత్య చేసేందుకు ఒక పథకాన్ని సిద్ధం చేసారు.

ఈ ఏడాది మే 8 వతేదీన  పవన్ కుమార్‌కు డబ్బులు అవసరమై వాలిపల్లి సురేష్ ను 2 వేలు అప్పుగా అడగగా, సురేష్  1000 ఇచ్చి, మిగిలిన డబ్బులు సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని వాలిపల్లి సురేష్  సువ్వాడ శంకర్ కు చెప్పగా, ఒక పథకం ప్రకారం సారిక గ్రామ సమీపంలోని కల్లు త్రాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్ లను తాళ్ళు, ప్లాస్టిక్ గోనె సంచెతో సిద్ధంగా ఉంచారు.

సురేష్ సాయంత్రం ఇస్తానన్న  1000 రూపాయల కోసం పవన్ కుమార్ ఫోను చేసి, సురేష్  వద్దకు రాగా, అక్కడ ఉన్న సువ్వాడ శంకర్ తో కలసి, ముగ్గురు ఒకే మోటారు సైకిలుపై కల్లు త్రాగే ప్రాంతం వద్దకు చేరుకొన్నారు. పవన్ కుమార్ మోటారు సైకిలు దిగుతుండగా సువ్వాడ శంకర్  పవన్ కుమార్ మెడ పైన, తలపైన కర్రతో బలంగా కొట్టడంతో పవన్ కుమార్ క్రింద పడిపోయి, మృతి చెందాడు.

మృతి చెందిన పవన్ కుమార్‌ను మేకల సోములు , పిట్టా శంకర్ లు ప్లాస్టిక్ గోనె సంచిలో దించి, మూట కట్టారు. అనంతరం, మోటారు సైకిలును, మూటను దగ్గరలోగల వ్యవసాయ బావి వద్దకు నలుగురు తీసుకొని వెళ్ళి, మోటారు సైకిలుకు శవం మూటను తాళ్ళతో కట్టి, మోటారు సైకిలుతో సహా బావిలో పడేసి, ఎవరికి ఇంటికి వారు వెళ్ళిపోయారు.

ఈ సంఘటన జరిగి సుమారు 2 మాసాలకు వ్యవసాయ బావిలో పవన్ కుమార్ మృతదేహం లో సగ భాగం నీటిలో తేలడం, పోలీసులు దర్యాప్తు చేయడంతో, హత్య చేయుటకు గల కారణాలు వెలుగు చూసాయని డిఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. మోటారు సైకిలుకు కట్టేసిన మృతదేహం మిగిలిన భాగాన్ని, మోటారు సైకిలును పోలీసులు బావి నుండి బయటకు తీయించారు.

ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వాలిపల్లి సురేష్ , సువ్వాడ శంకరరావు, మేకల సోములు, పిట్టా శంకర్ , గిడిజాల జగదీష్ లను విజయనగరం రూరల్ సీఐ మంగవేణి అరెస్టు చేసి, నిందితులను రిమాండు నిమిత్తం కోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో విజయనగరం రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, రూరల్ ఎస్ ఐలు పి.నారాయణరావు, వి.అశోక్ కుమార్, గంట్యాడ ఎస్ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు, సీసీఎస్ ఎస్ఐ కె. ప్రశాంత్ కుమార్, ఎఎస్ఐ ఎ.త్రినాధరావు, హెచ్ సిలు వి. శ్యామ్ బాబు, ఆర్. రామారావు, కానిస్టేబుళ్ళు షేక్ షఫీ, కె.కోటేశ్వరరావు, పివి రమణ, సాయి క్రియాశీలకంగా పని చేసారని, వారిని అభినందిస్తూ, ప్రోత్సాహక నగదు బహుమతులను డీఎస్పీ అనిల్ కుమార్ అందజేసారు.

Related posts

తిరుపతిలో వారసత్వ రాజకీయాలు రాణించవా?

Satyam NEWS

గద్వాల్ క్రికెట్ టోర్నీలో శ్రీ సౌమ్య విజయం

Bhavani

భూ దందాలు చేస్తున్న వైసీపీ కీలక నాయకుడిపై వేటు

Satyam NEWS

Leave a Comment