32.7 C
Hyderabad
March 29, 2024 12: 04 PM
Slider విజయనగరం

Vijayanagaram Police: అక్క‌డిక్క‌డే ప‌రిష్కార దిశ‌గా సిబ్బందితో ఫోన్లోనే చ‌ర్య‌లు

#deepikapatilips

ఖాకీ డ్ర‌స్ వేసుకున్న వారికి మ‌న‌స్సు  ఉంటుందా…?  బాధితుల క‌ష్టాల‌ను వింటారా… ? అస్స‌లు వాటిని తెలుసుకునే య‌త్నం చేస్తారా… ?  పోనీ తెలుసుకున్న  వాటి కోర‌ర‌కు ప‌రిష్కార చ‌ర్య‌లు తీసుకుంటారా..? ఈ ప్ర‌శ్న‌లు  ప్రతీ ఒక్క‌రి మ‌న‌సులో మెద‌ల‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే ఖాకీ అంటే అలాంటి భావ‌న‌, అభిప్రాయం…సోష‌ల్ మీడియా ,  స్మార్ట్  ఫోన్ ల పుణ్య‌మా ప్ర‌తీ ఒక్క‌రిలో నాటుకుపోయింది. కాని గ‌డ‌చిన కొద్ది నెల‌ల నుంచీ ప్ర‌జ‌ల‌ల లో అదీ బాదితుల క‌ష్టాల‌ను క‌ళ్లారా చూసో లేక మ‌రేమో  గాని ఖాకీలు  కాస్తా మాన‌వ‌తా మూర్తులుగాను…ఆప‌ద‌తో ఆదుకోవాల‌నే ఉద్దేశ్యంతో ఖాకీ  నుంచీ పోలీసు అన్న ప‌దాన్ని ప్ర‌జ‌ల‌ను వినియోగించే ప‌నిలో ప‌డ్డారు.

ఈ  సోదంతా ఇప్పుడు చెబుతున్నార‌ని అనుకోకండి.పాయింట్ కే వ‌స్తున్నా.ఏపీ పోలీస్ శాఖ ప్ర‌తీ సోమ‌వారం రెవిన్యూ శాఖ మాదిరిగానే స్పంద‌న కార్య‌క్రమం నిర్వ‌హిస్తు వ‌స్తోంది. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లాకు కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ దీపికా ఎం పాటిల్…కూడా  స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు కరోనా మూలంగా జిల్లా  పోలీస్ కార్యాల‌యంలో ఓ మూలన‌ టెంట్ వేసి…బాధితుల‌కు ,పోలీస్ అధికారుల‌కు మ‌ధ్య ఓ క‌ర్టెన్ ఏర్పాటు చేసి మరీ ఎవ్వ‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా నామ‌మాత్రంగానే జ‌రిపించామ‌న్న  చందంగా స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్విహించేన‌వారు.

కరోనా  మెల్ల మెల్ల‌గా సమ‌సి పోవ‌డంతో పోలీస్ స్సంద‌న ను బ్యారెక్స్ లో నిర్వ‌హిస్తు వ‌స్తోంది..జిల్లా పోలీసు శాఖ.  తాజాగా జ‌రిగిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో బాధితుల మొర‌ను ఫిర్యాదు రూపంలో ప్ర‌త్యేకించి చ‌దివి తెలుసుకున్న ఎస్పీ దీపికా ఎం పాటిల్ త‌క్ష‌ణం అందుకు సంబంధించి రూర‌ల్ సీఐ మంగ‌వేణికి డీసీఆర్బీ సీఐ వెంక‌ట‌రావు ద్వారా ఫోన్ చేయించి..స‌ద‌రు బాధితుని కేసు పూర్వ‌ప‌రాల‌ను అక్క‌డిక్క‌డే క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ..న్యాయ,అన్యాయాలు ఆధారాలు ప‌రిశీలించి  త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితుని ముందే స‌ద‌రు సీఐ కు చెప్పారు.

ఏదైనా పోలీస్ స్టేష‌న్ కు వెళితే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుందా అన్న సందేహంలో ఉన్న బాధితులు ప్ర‌స్తుతం జిల్లా పోలీస్ కార్యాల‌యానికి వ‌చ్చి త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు…న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం..విశ్వాసంతో.  ఆ విధంగా ఆ న‌మ్మ‌కం,విశ్వాసం అనే ఈ రెండు  ప‌దాల‌ను పోలీస్ శాఖ అందునా లేడీ ఎస్పీ దీపికా ఎం  పాటిల్  నిజం చేస్తార‌ని  బాధితులు ఎదురు చూస్తున్న ఆశ‌ను నిజం చేయాల‌ని కోరుతోంది… స‌త్యం న్యూస్.నెట్.

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్          

Related posts

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani

సిఐ అర్జున్ నాయక్ పై ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ లో కేసు

Satyam NEWS

నకిలీ లేఖలతో వేంకటేశ్వరుడి వద్దే మోసం

Satyam NEWS

Leave a Comment