24.7 C
Hyderabad
March 29, 2024 07: 22 AM
Slider విజయనగరం

రాత్రి సమయంలో రోడ్ల పైకి విజయనగరం లేడీ పోలీస్..!

#VijayanagaramPolice

ఏపీలో ని కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా…జగన్ ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ పెట్టింది. దరిమిలా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో రాత్రి పూట పోలీసులు విధి నిర్వహణ మరింత పెరిగింది.ఈ మేరకు విజయనగరం జిల్లాలో కరోనా కేసులు అయిదు వందలకు పైబడే నమోదవుతున్నాయి.ఈ పరిస్థితి ల్లో ప్రతీ ఒక్కరికి, ప్రతీ జంక్షన్ లో కరోనా  పరంగా అలెర్ట్ చేస్తున్నారు.. పోలీసులు.

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ మంగవేణి తన సిబ్బంది తో నగర చుట్టు పక్కల ప్రధాన జంక్షన్ లలో అటు వాహనదారులకు ,ఇటు స్థానిక ప్రజలకు తగు సూచనలిచ్చారు.వై జంక్షన్, జేఎన్టీయూ జంక్షన్ వద్ద వాహనాలను ఆపి మరీ జాగ్రత్తలు ఇచ్చారు.

మరీ ముఖ్యంగా జేఎన్టీయూ వద్ద సాలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను ఆపి అక్కడే పెట్రోల్ బంక్ వద్ద అందరి చేత ప్రమాణం చేయించారు. ఎస్ఎంఎస్ లతో పాటు వ్యాక్సిన్ వేసుకోవాలని మరీ మరీ చెప్పారు. ఈ సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని,బయటకు వచ్చే ప్రతీ ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

తెలంగాణ చేనేత కార్మికుల భరోసా యాత్ర

Satyam NEWS

ఆర్ధికంగా పతనమైపోయిన ఉక్రెయిన్: మరి కొన్ని దేశాలు కూడా…

Satyam NEWS

Exit poll: గుజరాత్ లో మళ్లీ మోదీ హవా

Satyam NEWS

Leave a Comment