40.2 C
Hyderabad
April 24, 2024 15: 16 PM
Slider విజయనగరం

ఎన్నికల ఆదేశాలను కచ్చితంగా అమలు జరగాలి

#SP Vijayanagaram

విజయనగరం జిల్లాలో మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సమాయత్తమవుతోంది..జిల్లా పోలీసు శాఖ. ఈ మేరకు విజయనగరం డివిజన్ లో మొత్తం 2,330 వార్డులలో 2366 పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందు కోసం జిల్లా పోలీస్ శాఖ దాదాపు 3 వేల మందితో బందోబస్తు నిర్వహించనుంది. ఈ మేరకు సిబ్బందిని ఉద్దేశించి పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ రాజకుమారీ మాట్లాడారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ అధిక

మున్సిపల్ ఎన్నికలకి కూడా నోటిఫికేషన్ వచ్చిందని దీంతో మార్చ్ 15 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. రహదారికి అనుకోని ఉన్న బూత్ కేంద్రాల వద్ద 100మీటర్ల లోపలకి ఎవరినీ లోపలకి రానివ్వకూడదనో. రెండు వైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

వంద మీటర్ల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడే ఉండాలని ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేకుండా పోలీస్ సిబ్బంది కేంద్రం లోపలకి వెళ్లకూడదన్నారు. ఎన్నికల ఆదేశాలను కచ్చితంగా, కఠినతరంగా అమలు చేయాలన్నారు.

పోలింగ్ ముందు రోజు రాత్రి అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేసారు. ఓటర్లని ప్రలోభలకు గురి చేసే వారిపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించాలని ఆధారాలను బట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామస్తుల నుంచి ఎటువంటి ఆహారం, నీరు ఇతరత్రా సేవలని తీసుకోవద్దన్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అల్లర్లు తలెత్తడానికి అవకాశం ఉంటుందని ముందు గా తన సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు.

అతి సమస్యాత్మక గ్రామాల్లో సిబ్బంది బందోబస్తు విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

Related posts

తిరుపతిలో మరో ఐదు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చెయ్యండి

Satyam NEWS

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

Satyam NEWS

మాజీ ఎంపీ ఉండవల్లిని కలిసిన “బ్రదర్”​ అనిల్​ కుమార్​

Satyam NEWS

Leave a Comment