28.7 C
Hyderabad
April 25, 2024 06: 41 AM
Slider విజయనగరం

డెల్టా కేసుల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం:ఎస్పీ రాజకుమారి

#RajakumariIPS

థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు రానున్నాయని రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ప్రజలను హెచ్చరించారు.

కరోనా కేసులు… రెండు రోజుల వ్యవధిలో 80,150 కేసులు నమోదవడంతో మళ్లీ జిల్లా ప్రజలను హెచ్చరించేందుకు గానూ ఎస్పీ రాజకుమారీ నగరంలో పర్యటించారు.

ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మూడు లాంతర్ల వద్ద అటు ట్రాఫిక్ ను ఇటు ప్రజలను  అలెర్ట్ చేసారు.

ఈ సందర్భంగా టూటౌన్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ జనార్దన్ రావులకు కరోనా గురించి ప్రజలకు సమయం ముగిసేలోగా ప్రజలు ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో కన్యకాపరమేశ్వరి టెంపుల్ వద్ద సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి..ఎస్పీ నీ…థర్డ్ వేవ్ గురించి, డెల్టా కేసుల గురించి ప్రస్తావించారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలను హెచ్చరించిందని..ఏపీలో ఇంకా రాలేదన్నారు. ఈ సందర్భంలోనే వన్ టౌన్ సీఐ మురళీతో ఎస్పీ మాట్లాడారు.

కేసులు పట్ల అప్రమత్తంగా ఉన్నామని..కర్ఫ్యూ సమయాలలో నిబంధనలను కచ్చితంగా అమలయ్యే లా సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ తెలిపారు.

Related posts

సస్పెండ్ చేస్తారా? ఎంత మందిని సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

రైల్లోనే తుపాకితో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్

Satyam NEWS

నిలువు దోపిడి చేస్తున్న స్మార్ట్ పాయింట్స్

Satyam NEWS

Leave a Comment