30.7 C
Hyderabad
April 19, 2024 07: 17 AM
Slider విజయనగరం

విజయనగరం పోలీసుల “స్పందన” కు 27 ఫిర్యాదులు…

#spandana

ప్రతీ సోమవారం  విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపికా తో పాటు ఓఎస్డీ, ఏఎస్పీ లు నిర్వహించేవారు. కానీ ఈ సోమవారం 1 వ తేదీ న జరిగిన స్పందన కార్యక్రమం ఏఎస్పీ ఓఎస్డీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ వారం మొత్తం 27 ఫిర్యాదులను బాధితుల వద్ద నుంచీ స్వీకరించి వాటి పరిష్కారానికి ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఓఎస్డీ ఆదేశించారు. వివరాలు ఒక్కసారి చూస్తే.. జియ్యమ్మవలస మండలంకు చెందిన ఒక వ్యక్తి ఒఎస్టీ కి ఫిర్యాదు చేస్తూ తనకు ఉద్యోగం కల్పిస్తానని మాయ మాటలు చెప్పి, తన వద్ద నుండి శ్రీకాకుళంకు చెందిన ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్నట్లు, తనకు ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు.

ఈ ఫిర్యాదుపై ఒఎస్డీ స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టలని చినమేరంగి ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం  అయ్యన్నపేటకు చెందిన ఒకామె ఒఎస్టీ కి ఫిర్యాదు చేస్తూ తనకు దివ్యాంగుల కోటాలో కలెక్టరేట్ లో ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి, తన వద్ద నుండి 2.5 లక్షలు నగదు తీసుకున్నట్లు, ఇప్పటి వరకు ఉద్యోగం కల్పించలేదని, డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఒఎస్డీ గారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వన్ టౌన్  ఎస్ హెచ్ఓ ను ఆదేశించారు.

పొలంలో సాగు చేయనివ్వడం లేదు

విశాఖకు చెందిన ఒక వ్యకి ఒఎస్డి కి ఫిర్యాదు చేస్తూ తనకు బాడంగి మండలంలో తనకు కొంత వ్యవసాయ భూమి ఉందని, సదరు భూమిలో పామాయిల్ తోటలు పెంచుతున్నట్లు, ఇటీవల వర్షాలకు భూమి గట్టులు పోగా, వాటిని తిరిగి నిర్మించే ప్రయత్నం చేస్తుండగా, కొంతమంది పాల్టేరు గ్రామస్థులు వచ్చి, పనులను అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఒఎస్టీ విచారణ చేపట్టి, చట్టపరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి రూరల్ సీఐను ఆదేశించారు. విజయనగరం జొన్నగుడ్డికి చెందిన ఒకామె ఓఎస్డీ కి ఫిర్యాదు చేస్తూ ఆమె తల్లిదండ్రులు వసుపు కుంకుమగా ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మిస్తుండగా, చుట్టు ప్రక్కల వాళ్ళు, ఇంటి పనులు జరగకుండా అడ్డుకొంటూ, కొంత స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఓఎస్డీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుకు న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐను ఆదేశించారు.విజయనగరం పూల్ బాగ్ కాలనీకి చెందిన ఒకామె ఓఎస్డీ కి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు, ఇప్పుడు పెండ్లికి నిరాకరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరారు.

ఏడు రోజుల్లో సమస్యలు పరిష్కారం కావాలి

ఈ ఫిర్యాదు పై స్పందించిన ఓఎస్డీ విచారణ చేపట్టి, టూటౌన్ సీఐను ఆదేశించారు. ఈ “స్పందన” కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే ఎస్పీ కార్యాలయానికి నివేదించాలని అధికారులను ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్ బి సీఐ బి. వెంకట రావు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, రుద్రశేఖర్, డిసిఆర్ బి ఎస్ఐలు నీలకంఠం, సూర్యారావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

భగత్ సింగ్ జీవితచరిత్ర తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినా అడిగే దమ్ములేని జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment