39.2 C
Hyderabad
March 29, 2024 16: 47 PM
Slider ప్రత్యేకం

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో డీసీఆర్బీ ఒక్క‌ రోజు నివేదిక….!

#deepikaips

దాదాపు నాలుగు నెల‌ల క్రితం జిల్లాకు కొత్త ఎస్పీ గా చార్జ్ తీసుకున్న దీపికా….శ‌ర‌వేగంగా ఎస్ఐ అధికారి స్థాయి నుంచీ డీఎస్పీ స్థాయి అధికారి వ‌ర‌కు  ఎవ‌రెవ‌రు..? ఏ విధంగా ప‌ని చేస్తున్నార‌నేది అనితి కాలంలో దాదాపు అన్ని స‌ర్కిళ్లు పరిదిలో ఉన్న స్టేష‌న్ ల‌ను త‌నిఖీ చేసి రికార్డుల‌తో పాటు సిబ్బంది ప‌ని తీరును తెలుసుకున్నారు.దీంతో రోజువారిగాక్రైమ్ రికార్డ్ నమోదు చేసుకుని అటు డీసీఆర్బీ కి త‌ద్వారా మీడియాకు తెలియ ప‌రిచాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు 22న జిల్లా వ్యాప్తంగా జ‌రిగిన నేర స‌మాచార  నివేదిక‌ను మీడియాకు విడుద‌ల చేసింది….పోలీస్ శాఖ‌.ఈ మేర‌కు  జిల్లా ఎస్పీ .దీపిక ఆదేశాలతో  రోడ్డు ప్రమాదాలు, జూదం నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు, గంజాయి, ,ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు,క‌రోనానిబంధనలు అరికట్టే వారిపైన కఠిన చర్యలు చేపట్టారు.

అలాగే మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ ఈ బి పోలీసులు సంయుక్తంగా 14 కేసులు నమోదు చేసి, 8గురిని అరెస్టు చేసి, వారి నుండి 495 లీటర్ల నాటు సారాను, 7.2 లీటర్ల ఐ.ఎం.ఎఫ్.ఎల్. మద్యాన్ని, సారా తరలించేందుకు వినియోగించిన నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సారా తయారు చేసేందుకు సిద్ధం చేసిన 2,200 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే పాత్రలను ధ్వంసం చేశారు.. ఇక కరోనా నిబంధనలు పాటించకుండా మాస్క్ ధరించని వాహనదారులపై 573 కేసులు నమోదు చేసి, వారిపై .658,600ల‌ ఈ-చలానాలు విధించారు.

ఇక‌ హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించని వాహనదారులు, అతి వేగంగా వాహనాలను నడిపిన వారిపైన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 1,015 కేసులను నమోదు చేసి, .1,68,600/- లను ఈ చలానగా విధించారు. దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టి, 369మంది  దిశా  యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ల లో నిక్షిప్తం చేసుకొనే చర్యలు చేపట్టారు. వీటితో దిశా  యాప్ ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 3,83,288 కు చేరింది.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల అభినందనలు

Satyam NEWS

స్కూల్ ఎన్నికల నిర్వహణపై కార్యశాల

Bhavani

సుభాష్ చంద్రబోస్ కాలనీలో బస్తీ బాట కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment