23.2 C
Hyderabad
November 29, 2021 17: 14 PM
Slider ముఖ్యంశాలు

Vijayanagaram Police: రెండున్నర గంటలు…45 ఫిర్యాదులు…

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో బాధితుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఫోనులో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులను న్యాయం చేయాలని  సిబ్బందిని ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ దీపికా బాధితుల నుంచీ 45 ఫిర్యాదులను స్వీకరించారు. తక్షణమే వాటికి  రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

మెంటాడ మండలం, మెంటాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటి స్థలంలో గృహ నిర్మాణం చేపడుతుండగా, స్థానికంగా కొంతమంది వ్యక్తులు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటూ, గొడవ పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఆండ్ర ఎసైను ఆదేశించారు.

కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తనకు ఇద్దరు కుమారులు కలరని, వారందరికి తన ఆస్తి పంపకాలు చేసి, నివాసం ఉండేందుకు ఒక ఇంటిని మాత్రం తమతో ఉంచుకోగా, సదరు ఇంటిని కూడా ఇచ్చేయమని పెద్ద కుమారుడు ఇబ్బంది పెడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని పార్వతీపురం సీఐను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

భర్త హింస ఇంక తాళలేను…..

రామభద్రపురం మండలం కొట్టక్కి కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తనకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగిందని ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న..తన భర్త బంధువులు మాటలు విని, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, అదనంగా డబ్బులు కట్నంగా తేవాలని బాధలు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రామభద్రపురం ఎస్ఐ ను ఆదేశించారు.

గరివిడి మండలం గొట్నంది కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 1.06 ఎకరాల భూమి గొట్నంది గ్రామంలో ఉన్నట్లు, సదరు భూమిలోకి కొంతమంది వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, టేకు చెట్లును నరికివేసి, భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో హద్దులుగా ఉన్న గట్టులను త్రవ్వేసినట్లు, అడ్డుకోవడానికి ప్రయత్నించగా, తనపై దౌర్జన్యానికి పాల్పడినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వర్గాలను పిలిపించి, డాక్యుమెంట్లును పరిశీలించి, సదరు భూమికి సర్వే చేయించి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని గరివిడి ఎస్ఐను ఆదేశించారు.

విశాఖ కంచరపాలెంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను విజయనగరం పట్టణంలో గల ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వారి వద్ద కోరుకొండలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించినట్లు, కాని సదరు వ్యక్తి ఇంతవరకూ ఇంటి స్థలాన్ని గాని, తీసుకున్న సొమ్మును గాని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ..చట్టవరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

గజపతినగరం మండలం, పురిటి పెంట కి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త తనను కొడుతూ శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేస్తున్నారని, తన భర్తను స్టేషనుకు పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరువురిని పిలిపించి, కౌన్సిలింగు చేయాలని గజపతినగరం ఎసీను ఆదేశించారు.

ఈ “స్పందన” కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, సమస్యలను ఏడు రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, డీసీఆర్ బిసీఐ బి.వెంకటరావు, ఎస్పీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డీసీఆర్ బి ఎస్పీలు నీలకంఠం, సూర్యారావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

పల్లెలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

Satyam NEWS

నేచుర‌ల్ స్టార్ నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో “ఇంకోసారి ఇంకోసారి” లిరిక‌ల్ వీడియో 13న విడుద‌ల‌

Satyam NEWS

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!