40.2 C
Hyderabad
April 19, 2024 17: 16 PM
Slider విజయనగరం

Vijayanagaram Police: ఒకేసారి 20 మంది ఎస్ఐ లకు స్థానచలనం

#vijayanagaram sp

ముందు గా ఊహించిన రీతిలో ఏపీలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో 20 మంది ఎస్ఐ లకు స్థానచలనం చేసారు.జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ లలో ఎస్ఐలుగా పని చేస్తున్న 20 మంది ఎస్ఐలకు బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ కి పంపగా వచ్చిన ఆదేశాలతో జిల్లా ఎస్పీ రాజకుమారి వారందరికీ బదిలీ చేసారు.

జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లులో పని చేస్తున్న 20మంది ఎస్ఐలకు పరిపాలనా సౌలభ్యం కొరకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

ఎస్ఐల బదిలీల ప్రతిపాదనలను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ఆమోదంకు పంపగా, డీఐజీ ఆమోదం తెలపడంతో ఎస్ఐల బదిలీ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ రాజకుమారి జారీ చేసారు.

విజయనగరం 1వ పట్టణ పీఎస్ లో పని చేస్తున్న బి. దేవిని వల్లంపూడి పీఎస్ కు, విజయనగరం 1వ పట్టణ పిఎస్ లో పని చేస్తున్న కె.కె.కె.నాయుడుకు గంట్యాడ పీఎస్ కు గంట్యాడ పీఎస్ లో పని చేస్తున్న బి.గణేష్ కు దిశ మహిళా పీఎస్ కు ఎస్.కోటలో పని చేస్తున్న జి. రాజేష్ కు పాచి పెంట పిఎస్ కు ,వల్లంపూడి పీఎస్ లో పని చేస్తున్న జి. లోవరాజుకు ఎస్. కోట పీఎస్ కు బదిలీ చేశారు.

తెర్లాం పీఎస్ లో పని చేస్తున్న నవీన్ పడాల్ కు బుదరాయవలస పీఎస్ కు బుదరాయవలస పీ ఎస్ లో పని చేస్తున్న ఎస్. రవిని విజయనగరం సీసీఎస్ పిఎస్ కు  బొబ్బిలి పీఎస్ లో పని చేస్తున్న కె.త్రివేణి రవి లక్ష్మిని దిశ మహిళా పీఎస్ కు బదిలీ అయింది.

గజపతినగరం పిఎస్ లో పని చేస్తున్న ఎ.సన్యాసినాయుడును చీపురుపల్లి పీఎస్ కు చీపురుపల్లిలో పని చేస్తున్న ఐ. దుర్గా ప్రసాద్ ను విజయనగరం 1వ పట్టణ పిఎస్ కు  పెదమానాపురం పీఎస్ లో పని చేస్తున్న పి.రమేష్ నాయుడు ను విజయనగరం సిసిఎస్ పిఎస్ కు బూర్జువలసలో పని చేస్తున్న బి. భాగ్యంను పెదమానాపురం పిఎస్ కు బదిలీ చేశారు.

బలిజిపేట పీఎస్ లో పని చేస్తున్న ఎ.నరేష్ ను బాడంగి పీఎస్ కు బాడంగి పిఎస్ లో పని చేస్తున్న బి.సురేంద్రనాయుడును తెర్లాం పీఎస్ కు,పాచిపెంటలో పని చేస్తున్న సిహెచ్.గంగరాజును గజపతినగరం పీఎస్ కు, విజయనగరం రూరల్ పీఎస్ లో పని చేస్తున్న వి.లక్ష్మీ ప్రసన్నకుమార్‌ను ఎస్.కోట పిఎస్ కు బదిలీ చేశారు.

విజయనగరం సీసీఎస్ పిఎస్ లో పని చేస్తున్న ఎం.ప్రశాంత్ కుమార్‌ను బొబ్బిలి పిఎస్ కు ,ఎస్.కోటలో పని చేస్తున్న కె.నీలకంఠంను విజయనగరం డీసీఆర్ బీకి నెల్లిమర్ల పీఎస్ లో పని చేస్తున్న ఎల్.దామోదరరావును విజయనగరం ట్రాఫిక్ పిఎస్ కు బదిలీ చేశారు.

విజయనగరం స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న బి.రవీంద్రరాజును నెల్లిమర్ల పిఎస్ కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేసారు. బదిలీ అయిన ఎస్ఐలను వెంటనే బదిలీ అయిన నూతన స్థానాల్లో హాజరు కావల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

Related posts

డప్పు రమేష్ జీవిత త్యాగం వెలకట్టలేనిది

Satyam NEWS

వెంటనే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయండి

Satyam NEWS

తెలంగాణతో కేసీఆర్ కు బంధం తెగిపోయింది

Satyam NEWS

Leave a Comment