33.2 C
Hyderabad
April 26, 2024 01: 29 AM
Slider విజయనగరం

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన పోలీస్ బాస్ లు

#BRAmbedkar

రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబాసాహెచ్ అంబేద్క‌ర్  130 వ జ‌యంతి సంద‌ర్బంగా న‌గ‌రంలోని బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ పూల‌దండ వేసి నివాళులు అర్పించారు.

అంత‌కుముందు  జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో  అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను  అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు ముఖ్య అతిధిగా హాజరై,ఆయ‌న‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి,  ఘనంగా నివాళుల్ల అర్పించారు.

ఈ సందర్భంగా ఏఏస్పీ మాట్లాడుతూ దేశంలో దళితులపై అంటరాని తనాన్ని, కుల నిర్మూలన కోసం డా.బిఆర్ అంబేద్కర్ కృషి చేసి, నేడు ఆ దళితులకు ఇతర కులాలతో సమానత్వం తీసుకొని వచ్చిన వ్యక్తన్నారు. భారతీయ న్యాయవాదిగా, ఆర్ధిక  శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా అట్టడగు వర్గాల అభ్యున్నతికి నిత్యం కృషి చేసారన్నారు.

అంతేకాకుండా, భారత రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించి, దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించి, అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ పరమైన హక్కులను ప్రసాదించిన మహా వ్యక్తని కొనియాడారు. డా. బిఆర్ అంబేద్కర్ నడిచిన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోలీసు స్టేషనుకు వచ్చే బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చెయ్యాలని అదనపు ఎస్పీ వి. సత్యన్నారాయణ రావు పోలీసు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఆర్ ఐలు ఎస్. చిరంజీవి, పి.నాగేశ్వరరావు, పి. ఈశ్వరరావు, పి.మరియన్ రాజు, టిటిఆర్ కే కుమార్,  ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

సమస్యల సాధనకు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

Satyam NEWS

దళితుల్ని గ్రామం నుంచి వెలివేసిన అగ్ర కులస్తులు

Satyam NEWS

Leave a Comment