27.7 C
Hyderabad
March 29, 2024 03: 16 AM
Slider విజయనగరం

స్వీప‌ర్ల‌ను ఆదుకుంటున్న విజయనగరం పోలీస్ శాఖ‌

#vijayanagarampolice (2)

ఆప‌దలో ఆదుకోవ‌డమంటే…ఇదే. తాను ఎన్ని క‌ష్టాల్లో ఉన్నా  ఎన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న త‌న కింద సిబ్బందిని ఆదుకోవ‌డ‌మే కాక‌..స్టేష‌న్ లో ప‌ని చేస్తున్న ఇత‌రుల‌ను కూడా సాయం ప‌డ‌టం మామూలు విష‌యం కాదు.  ప్రార్ధించే పెద‌వుల క‌న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న చందంగానే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ…త‌న శాఖా సిబ్బందిని  ఆదుకుంటున్న తీరు…శాఖ‌లో మిగిలిన డివిజ‌న్ స్థాయి అధికారుల‌లో కూడా ఆ గుణం వెల్లువెత్తుతోంది. తాజాగా బొబ్బ‌లి డీఎస్పీ మోహ‌న‌రావు…త‌న డివిజ‌న్ ప‌రిధిలో పెద‌మానాపురం స్టేష‌న్ లో స్వీప‌ర్ గా ప‌ని చేస్తున్న చాట‌ల బుజ్జ‌మ్మ‌ను  ఆప‌ద స‌మ‌యంలో కాదు…కాదు క‌ష్ట స‌మ‌యంలో ఆదుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలో లేక ఆమె  ఇచ్చిన స్పూర్తితోనే…పెద మానాపురంలో గ‌త  కొన్నేళ్లుగా స్వీప‌ర్  గా ప‌ని చేస్తున్న  చాట‌ల బుజ్జ‌మ్మ దైన్య స్థితిని తెలుసుకున్నారు. ఈ సెకండ్ వేవ్ క‌రోనా సోకిన విప‌త్కాల స‌మ‌యంలో  స్వీప‌ర్ బుజ్య‌మ్మ‌కు క‌ష్టం వ‌చ్చంద‌ని డీఎస్పీ మోహ‌న్ రావు తెలుసుకున్నారు. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా  ఓ నెల‌కు స‌రిప‌డే నెల‌స‌రి సామాన్యు తెప్పించారు. అక‌స్మాత్తుగా బొబ్బిలి డీఎస్పీ మోహ‌న్ రావు పెద‌మానాపురం స్టేష‌న్ కు వ‌చ్చి..స్వీప‌ర్ బుజ్జ‌మ్మ‌ను ప‌లిచి…నెలకు స‌రిప‌డే స‌రుకుల‌ను అంద చేసి..సేవా నిర‌తిని చాటుకున్నారు.హేట్సాస్..ఎస్సీ రాజ‌కుమారీ..హేట్సాప్..డీఎస్పీ మోహ‌న్ రావు..హేట్సాప్..పెద‌మానాపురం స్టేష‌న్ ఎస్ఐ ర‌మేష్ నాయుడులు.

Related posts

సంక్షేమం, అభివృద్ది ఈ రెండు మా ప్ర‌భుత్వానికి కళ్ళు

Satyam NEWS

రుతుపవనాలు మరో 4 రోజులు ఆలస్యం

Bhavani

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS

Leave a Comment