36.2 C
Hyderabad
April 23, 2024 20: 23 PM
Slider ప్రత్యేకం

దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన విజయనగరం ఎస్పీ

#deepikaips

మూడు నెలల క్రితం విజయనగరం జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకున్న దీపికా ఎం పాటిల్..వృత్తి ధర్మం తో పాటు.. సేవా తత్పరతను స్వయంగా చేసి..తన శాఖ సిబ్బందికి స్పూర్తినిచ్చే పని కూడా చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని కొత్తవలస మంగలపాలెంలో గల శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 21వ వార్షికోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ దీపికా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ట్రస్టు ఆధ్వర్యంలో నడుపుతున్న కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. కృత్రిమ అవయవాల తయారు చేస్తున్న విధానం అడిగి తెలుసుకున్నారు.

గత ఏళ్లుగా  ట్రస్ట్ చేస్తున్న సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు. ట్రస్టు తరపున 80 మంది వృద్దులకు బియ్యం పంపిణీ చేయడంతోపాటు, మరో 100 మంది అంధులకు బ్లైండ్ స్టిక్కులను, పింఛన్లు, 30 మంది దివ్యాoగులకు కృత్రిమ అవయవాల, వీల్ ఛైర్స్ మరియు మూడు చక్రాల బళ్ళు, వినికిడి యంత్రాలను జిల్లా ఎస్పీ అందించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు, విజయనగరం డీఎస్పీ అనిల్ పులిపాటి, కొత్తవలస సీఐ బాల సూర్యారావు, డా. ఫణీంద్ర, డా.అచ్చుత రామయ్య , గురుదేవ హాస్పిటల్ సంస్థ సీఈఓ,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పుట్టిన రోజు తల్లి సమక్షంలో మోడీ

Satyam NEWS

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

కాజ్ ఆఫ్ డెత్ :నాతల్లి మరణానికి జాతీయ రహదారుల సంస్థే కారణమం

Satyam NEWS

Leave a Comment