32.7 C
Hyderabad
March 29, 2024 12: 29 PM
Slider విజయనగరం

ఉదయం ఏజన్సీ ఏరియాలో…సాయంత్రం జిల్లా కేంద్రంలో…!ఎవరంటే…?

#RajakumariIPS

ఎట్టకేలకు ఏపీ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ లకు స్థలనం కలిగిన విషయం విదితమే. ఇక పోలీసు శాఖలో కూడా కొంత మందికి ఎస్పీ స్థాయి నుంచీ డీఐజీ గా పదోన్నతులు కూడా వచ్చాయి. వాళ్లకు ఇక పోస్టింగ్ ఇవ్వడమే ఆలస్యం.ఈ తరుణంలో రాష్ట్రంలో ని రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లా కు ఎస్పీగా వచ్చిన బీ.రాజకుమారి కి సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే డీఐజీ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా. ఇచ్చింది.

ఇక డీఐజీ పోస్ట్ కు బదిలీ చేయడమే ఆలస్యం. ఈ నేపథ్యంలో మహమ్మారి కరోనా విజృంభిస్తున్న సమయంలో దాన్ని అరికట్టేందుకు శాయశక్తులా కృషిచేయడంలో ఓ లేడీ ఎస్పీగా రాజకుమారి తీసుకున్న చర్యలు అనన్య సామాన్యం.ఈ క్రమంలో ఎస్పీ కూడా కొద్ది రోజులు బంగ్లాకే పరిమితం అయినా అక్కడ నుంచీ.. ఆఫీసు కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

ఎట్టకేలకు ఎస్పీ..తిరిగి యధావిధిగా విధులకు హాజరవుతూ శాఖ సిబ్బంది కి కరోనా పరంగా తగుఆదేశాలివ్వడమేకాక… ప్రత్యక్షంగా సిబ్బంది చేస్తున్న పనితీరును గమనిస్తూ వస్తున్నారు. తాజాగా అటు మారుమూల ఏజన్సీలో గిరిజనులతో మమేకమై కరోనా వారు పడుతున్న అవస్థలను తెలుసుకుని చలించిపోయారు.

తక్షణం వాళ్లను ఆదుకోవాలని తలచిన మరుక్షణమే పాచిపెంట వెళ్లి సాలూరు సిబ్బంది తో కలిసి ఆ రెండు ఊర్ల ప్రజలకు శాఖా పరంగా ‘చేయూత’ నిచ్చి.. వాళ్లల్లో మనోధైర్యం నింపారు.. ఎస్పీ రాజకుమారి.మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి అనంతరం బయలుదేరి నేరుగా బంగ్లాకు వెళ్లకుండా… జిల్లా కేంద్ర మైన విజయనగరం లో కర్ఫ్యూ పరిస్థితి,తద్వారా సిబ్బంది చేస్తున్న పనిని ప్రత్యేక్షంగా పరిశీలించేందుకు ప్రధాన జంక్షన్ల లో ఓసారి చుట్టేసారు.

వాస్తవానికి ఏ జిల్లా ఎస్పీ అయినా ఉదయం ఏజన్సీ కి వెళితే మధ్యాహ్నానికి బంగ్లాకు వెళ్లిపోతుంటారు.కానీ ఓ లేడీ అయి ఉండి కాబోయే డీఐజీ అయిన ఎస్పీ…ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి మళ్లీ విధులు నిర్వర్తించడం..ఇదే ప్రథమం.

ఏజన్సీ ప్రాంతం నుంచీ నేరుగా నగరంలో ని గూడ్స్ షెడ్ ,సీఎంఆర్, కన్యకాపరమేశ్వరి టెంపుల్,గంటస్థంభం, బాలాజీ జంక్షన్ వంటి ప్రదేశాలలో కర్ఫ్యూ పరిస్థితి ని పరిశీలించారు. ఉదయమే ఏజెన్సీ ఏరియా అయిన పాచిపెంట కు వెళ్లే ముందు కూడా పైన చెప్పిన జంక్షన్ల ను పరిశీలించే వెళ్లారు.

అట్నుంచి..కూడా నేరుగా బంగ్లాకు వెళ్లకుండా తిరిగి నగర జంక్షన్ లలో సీఐ ర్యాంక్ అధికారులు పని చేస్తున్న తీరును పరిశీలించారు.ఏదైనా జిల్లాలో రోజులో దాదాపు 16 గంటలు పని చేసిన ఏకైక ఎస్పీ…ఎవ్వరంటే.. అది రాజకుమారియేనని యావత్ జిల్లా పోలీస్ శాఖ అనుకోవడం విశేషమే.

Related posts

ఆరు రోజుల లలో సిబ్బంది కి బదిలీలు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు

Satyam NEWS

దుబాయ్ లో భారీ వర్షంతో జన జీవితం అతలాకుతలం

Satyam NEWS

విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ సందర్శన

Satyam NEWS

Leave a Comment