39.2 C
Hyderabad
March 29, 2024 15: 19 PM
Slider విజయనగరం

మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదంటూ మాస్క్ లు తొడిగిన ఎస్పీ…!

#VijayanagaramSP

ఓ కరోనా సెకండ్ వేవ్ భయాందోళనలు…మరో వైపు ..కేసులులో ఎగుడుదిగుడులు.నిన్న కాక మొన్న 42 కేసులు నమోదైన విజయనగరం జిల్లా లో నిన్నటి రోజు రెండే రెండు కేసులు నమోదయ్యాయి.

ఈ పరిస్థితులలో అస్సలు కరోనా సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో వైద్యశాఖ అంచనా వేయలేక పోతుంది. ఈ పరిస్థితి ని కొంతలో కొంత ఫీల్డ్ లెవల్ లో అంచనా వేసింది..జిల్లా పోలీసు శాఖ.

ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచీ సోషల్ డిస్టెన్స్ ,మాస్క్ ,శానిటైజేషన్ (sms) తో జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.. పోలీసు శాఖ.

తాజాగా… జిల్లా ఎస్పీ నేరుగా రద్దీతో ఉన్న రైతు బజార్ లపైన ,వ్యాపారస్థులపైన దృష్టి పెట్టసాగారు.

ఇంతవరకూ సాధారణ ప్రజలకు మాస్క్ ల పై అవగాహన కల్పించిన ఎస్పీ.. ప్రస్తుతం చిల్లర వర్తకులు..చిన్న అమ్మకం దారులపై దృష్టి పెట్టారు.

ఈ మేరకు నగరంలో దాసన్నపేట రైతు బజార్ లోపలకు వెళ్లి తనిఖీ చేసారు. అలాగే రాజీవ్ స్టేడియం..వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిని పరిశీలించి మాస్క్ లు లేని వారికి స్వయంగా అవగాహన కల్పించి మాస్క్ తొడిగారు.

అలాగే కోడి రామ్మూర్తి భవనం ,న్యూపూర్ణ ట్యాక్సీ స్టాండ్ వంటి ప్రదేశాలను ఎస్పీ పరిశీలించి… కరోనా వ్యాప్తి గురించి అవగాహన కల్పించడంతో పాటు…మాస్క్ లు పంచి..ఇక పై మాస్క్ లేకపోతే జరీమాన విధిస్తామని హెచ్చరించారు.

Related posts

కొత్త వ్యవసాయ చట్టానికి నేడు నిరసన

Satyam NEWS

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

క్యాన్సర్ హాస్పిటల్ లో గణేష్ చతుర్ధి జరిపిన బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment