28.7 C
Hyderabad
April 20, 2024 06: 42 AM
Slider విజయనగరం

మాస్క్ లు చిన్నారులకు సరిపోవు..మరి ఎలా తొడిగారంటే…?

#VijayanagaramSP

జాలి ,కరుణ ,దయ , ఇతరులకు సాయపడటం…ఆపదలో ఆదుకోవడం..కష్టాలలో ఉన్నారికి సాయపడటం.. ఇన్ని మంచిగుణాలు ఉన్న పోలీసు ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా..? అంటే విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అని వేరేగా చెప్పనక్కర్లేదు.

కరోనా సమయంలో ఎస్పీ రాజకుమారీ తెగువ ఏంటో..సోషల్ మీడియాలో పుణ్యమా యావత్ ప్రపంచానికే తెలిసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా విజయనగరం జిల్లాలో కేసులు మరోసారి రెండు వందలకు చేరువలో ఉన్నాయి.

ఈ వేవ్ ను తగ్గించేందుకు రోజూ పర్యటన లు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్..కుర్రాళ్లు ,పిల్లల వల్లే వస్తోందని తెలుసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం.. వారిపైనే దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో నగరంలో మూడులాంతర్ల వద్ద మాస్క్ ల అవేర్నస్ లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకూ మాస్క్ లు లేకపోవడాన్ని చూసిన ఎస్పీ స్వయంగా చిన్నారులకు మాస్క్ తొడిగే యత్నం చేసారు.

అయితే మాస్క్ లు పెద్దవి..చిన్నారులకు ముఖం చిన్నవై పోవడంతో క్షణం ఆలోచించకుండా.. మాస్క్ లు దారాలను..ఎస్పీ రాజకుమారీ అక్కడికక్కడే చిన్నగా ముడివేసి..చిటెకలో..ఇద్దరు చిన్నారులకు…తొడిగి..వాళ్లతో వచ్చిన మహిళలకు కరోనా జాగ్రత్తలు చెప్పారు.. ఎస్పీ.

ఏదైనా…సహనానికి మారు పేరు స్త్రీ. ఆ స్త్రీ ఎవరైనా ఉన్నారంటే..ఆమెనే జిల్లా ఎస్పీ రాజకుమారీ. హేట్సాఫ్.

కె భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

కేసీఅర్  నాయకత్వంలో  అభివృద్ధి పథంలో  తెలంగాణ

Satyam NEWS

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Bhavani

ముంబయి ద్వీవుల్లో చిక్కకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు

Satyam NEWS

Leave a Comment