36.2 C
Hyderabad
April 25, 2024 19: 01 PM
Slider ముఖ్యంశాలు

కంటిమీద కునుకు లేకుండా ద‌ర్యాప్తు చేస్తున్న లేడీ ఎస్పీ

#VijayanagaramSP

ప్ర‌సిద్ది గాంచిన రామతీర్దం నీలాచ‌లం కొండ‌పై రాములోరి విగ్ర‌హ ఖండ‌న కేసులో పోలీసుల‌కు ఇంత‌వ‌ర‌కు ఏ ఒక్క ఆచూకీ చిక్క‌లేదు. ఆ కేసున‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ఫ ద‌ఫాలుగా…దాదాపు 30 మందిని విచారించారు పోలీసులు.

నిన్న‌కాక మొన్న‌నే స్వ‌యంగా ఎస్పీ  రాజ‌కుమారీ ని మీడియా ప్ర‌శ్నించ‌గా 20 మందిని అదుపులో తీసుకున్నామ‌ని తెలిపారు. ఇద్ద‌రు మంత్రులు, రాజ్య‌స‌భ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు నీలాచలం కొండ‌ను ద‌ర్శించి…దిగువ‌న ఉన్న దేవాల‌యాన్ని ద‌ర్శించుకుని తీర్ద ప్ర‌సాదాలు తీసుకున్నారే గాని ఆ కేసున‌కు సంబంధించి ఇంత వ‌ర‌కు ఎటువంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు.

విగ్ర‌హ ధ్వంసం కేసు దోషులు దొరికేదెన్న‌డు…?

ఈ కేసులోనే నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్ప‌ల‌నాయుడు…స్వ‌యంగా దేవాల‌య పూజారుల‌ను ప్ర‌శ్నిస్తూ..ఎవ‌రిమీద‌గాని అనుమానం ఉంటే చెప్పాల‌ని కూడా కోరారు.

మరోవైపు కేస ద‌ర్యాప్తు సీరియ‌స్ అవ్వ‌డంతో స్వ‌యంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు రంగంలోకి దిగి…..విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసు అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

దీంతో  విగ్ర‌హ ధ్వంసం కేసు ను సీరియస్ గా తీసుకున్న విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ కంటి మీద కునుకు లేకుండా రేయింబ‌వ‌ళ్లు…ఆఫీసులోనే  ఉంటూ…ఐటీ విభాగ‌పు అధికారుల‌తో కూడా సంప్ర‌దిస్తున్నారు.

బిజెపి జనసేనల సంయుక్త నిరసన

నిన్నమొన్న‌టి వ‌ర‌కు వైఎస్ఆర్సీపీ…టీడీపీ, హిందూ ధార్మిక సంఘాలు నీలాచలం కొండ వ‌ద్ద ఆందోళ‌న కొన‌సాగిస్తే…మేమేమీ త‌క్కువ తినలేదంటూ…బీజేపీ,జ‌న‌సేన‌లు సంయ‌క్తంగా నిర‌స‌నల‌కు పిలుపునిచ్చారు.

ఉదయం 11 గంట‌ల‌కు…బైక్ ర్యాలీతో బ‌య‌లు దేరుతున్నామ‌ని అందుకు అనుమ‌తి కావాలంటూ జిల్లా ఎస్పీని కోరారు కూడా. అయితే అనుమతులు వ‌చ్చినా రాక‌పోయినా..విజ‌య‌న‌గ‌రం నుంచీ నీలాచలం కొండ‌వ‌ర‌కు బైక్ ర్యాలీతో వెళ్లాల‌ని ఆ రెండు పార్టీలు నిర్ణ‌యించారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, జ‌న‌సేన నేత నాదెండ్ల మనోహ‌ర్ లు సంయుక్తంగా ఆ ర్యాలీలో పాల్గొన‌డ‌మేకాకుండా..నీలాచ‌లం కొండ వ‌ద్ద నిర‌స‌న తెలియ చేయ‌నున్నారు.

క‌రోనా వ్యాప్తి దృష్ట్యా సభలకు అనుమతులు నో: ఎస్సీ ఆదేశాలు

ఇక పోతే…క‌రోనా వ్యాప్తి దృష్ట్యా..   విజయనగరం జిల్లాలోని  రామతీర్ధంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని  జిల్లా ఎస్పీ రాజకుమారి  తెలిపారు.

శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ధ్వంసం కేసు దర్యాప్తున‌కు ప్రతీ ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాల‌ని ఎస్పీ కోరారు. ప్రస్తుతం సెక్షను 30 పోలీసు చట్టం 1861 మరియు క‌రోనా డిసాస్టర్ మేనేజ్ మెంటు చట్టం అమలులో ఉన్నందున ప్రజలెవ్వరూ చట్టాలను అతిక్రమించి…, బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణలో పాల్గొనవద్దని సూచించారు.

దేవాలయ పరిసర ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు, ధర్నాలు, సమావేశాల నిర్వహణ కు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా చట్టాలను అతిక్రమించి ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Related posts

డియర్ ప్రైమ్ మినిస్టర్: ఇక చెప్పడానికి ఏముంది?

Satyam NEWS

కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త

Murali Krishna

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

Satyam NEWS

Leave a Comment