39.2 C
Hyderabad
April 23, 2024 18: 28 PM
Slider విజయనగరం

విజయనగరం టూటౌన్ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ దీపికా…!

#surprisevisit

విజయనగరం జిల్లా పోలీసు బాస్…జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. సరాసరి నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న బంగ్లా నుంచీ సరాసరి ఆఫీసు కు వెళ్లకుండా నేరుగా టూటౌన్ పోలీసు స్టేషన్ పరిశీలించారు.జిల్లా ఎస్పీ ఎం.దీపిక విజయనగరం టూటౌన్ పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేసి, స్టేషను పరిసరాలు, లాకప్ గదులను పరిశీలించారు.

102 సిఆర్ పిసి ప్రకారం సీజ్ చేసిన వాహనాలను నిబంధనలు ప్రకారం వేలం వేయాలని, పట్టదగిన నేరాలపై వచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించుటకు కృషి చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. విజయనగరం టూటౌన్ సీఐ సిహెచ్.లక్ష్మణరావు వివిధ కేసుల్లో పురోగతిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, వివరించారు.

Related posts

హుజూరాబాద్ కోసమే కేసీఆర్ దళిత స్కీమ్

Satyam NEWS

డాక్టర్లు చేసే సేవతోనే ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేది

Satyam NEWS

నాసిరకం పనులతో కుప్పకూలిన భగీరథ ట్యాంక్

Satyam NEWS

Leave a Comment