విజయనగరం జిల్లా 32 ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యత చేపట్టిన అతి కొద్ది గంటలలోనే విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పై దృష్టి సారించడమే కాక… మూడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజునే గంజాయిపై ఉక్కు పాదం మోపుతానని చెప్పిన తడవు వెను వెంటనే ఎస్ కోట వద్ద బొడ్డవర చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ముందుగా కొత్తవలస పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని పరిశీలించి, స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు.
స్టేషనులో నమోదైన మిస్సింగ్ కేసులు, గంజాయి కేసులు రివ్యూ చేసారు. రోడ్డు ప్రమాదాలను జరుగుటకు ప్రధాన కారణాలను, ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలను ఎస్సై సుదర్శన్ అడిగి తెలుసుకున్నారు. స్టేషనులో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నది, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల గురించి ఆరా తీశారు.*ఈ ఆకస్మిక తనిఖీసమయంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ కే.కే.వి.విజయనాథ్, ఎస్సై సుదర్శన్, ఇతర అధికారులు మరియు పోలీసు స్టేషను సిబ్బంది హాజరుగా ఉన్నారు. అక్కడ నుంచీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎల్.కోట పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని పరిశీలించి, స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు.
స్టేషనులో నమోదైన మిస్సింగ్ కేసులు, మహిళపై జరిగిన దాడుల కేసులు, గంజాయి కేసులు రివ్యూ చేసారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిస్సింగ్, మహిళలపై జరిగే దాడులలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, గ్రామ సందర్శనలు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదాల నియంత్రణకు విజిబుల్ పొలీసింగు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీ సమయంలో ఎస్.కోట సిఐ ఉపేంద్రరావు, ఎస్సై ఆర్.గోపాలరావు పాల్గొన్నారు. అక్కడ నుంచీ ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో గల బొడ్డవర చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.గంజాయి అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు ఏవిధంగా చేపడుతున్నది. ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇతర అధికారులు, చెక్ పోస్టు సిబ్బంది ఉన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా