38.2 C
Hyderabad
April 25, 2024 12: 39 PM
Slider విజయనగరం

ఆటో డ్రైవ‌ర్ల‌కు విజ‌య‌న‌గ‌రం ట్రాఫిక్ డీఎస్పీ క్లాస్…!

#vijayanagarampolice

డ్రైవింగ్  చేసే  స‌మ‌యాలలో  ప్ర‌తీ ఆటో డ్ర్రైవ‌ర్..త‌మ సీటు ప‌క్క‌నే వారి కుటుంబ స‌భ్యుల పోటోను పెట్టుకోవాల‌ని  విజ‌య‌న‌గ‌రం ట్రాపిక్ డీఎస్పీ  మోహ‌న్ రావు సూచించారు.జిల్లాఎస్పీ దీపిక ఆదేశాల‌తో  న‌గ‌రంలోని  ఆర్టీసీ కాంప్లెక్స్  వ‌ద్ద  ఆటో డ్రైవ‌ర్ల‌కు  చిన్న పాటి క్లాస్ తీసుకున్నారు. సీటు బెల్ట్ ధ‌రించాల‌ని..యూనీఫాంతో ఉండాల‌ని…ప‌రిమితికి మించి ప్ర‌యాణీకుల‌ను  ఎక్కించ‌రాదంటూ వాళ్ల‌కు చెప్పారు.మ‌రీ ముఖ్యంగా డ్రైవింగ్  చేసే స‌మ‌యంలో త‌మ‌,,త‌మ కుటుంబ  స‌భ్యుల  ఫోన్ నెంబ‌ర్లు…ఫోటోలు  పెట్టుకోవాల‌ని  సూచించారు.ఈ సంద‌ర్భంగా  డీఎస్పీ.. ట్రాఫిక్ ఎస్ఐలు  అయిన భాస్క‌ర‌రావు, దామోద‌ర‌రావు,హ‌రి బాబుల‌తో  క‌లిసి….ఆటో డ్రైవ‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు,జాగ్ర‌త్త‌లు తెలిపారు.

ప్రతీ ఒక్కరూ యూనిఫాం ధరించాలని, వాహనాల రికార్డులు సక్రమంగా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించ వద్దని, అతివేగంతో వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేసే స్థలంలో కుటుంబ సభ్యుల ఫొటో పెట్టు  కోవాల‌ని  తెలిపారు.

Related posts

డా.మోహన్ కు భారతదేశ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

Satyam NEWS

Analysis: కరోనా కంగనా మధ్యలో శివసేన

Satyam NEWS

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు నిధులు

Satyam NEWS

Leave a Comment