34.2 C
Hyderabad
April 23, 2024 13: 39 PM
Slider విజయనగరం

కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తం: ట్రాఫిక్ సిబ్బంది కి సోకడంతో అలెర్ట్

#VijayanagaramTrafficPolice

కరోనా సెకండ్ వేవ్ పట్ల సాధారణ ప్రజానీకం తో పాటు పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీస్ శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటున్నది. ఒక్క రోజులోనే 500 కేసులు కావడంతో అలెర్ట్ అవుతున్నారు. జిల్లా పోలీసు శాఖ లో ట్రాఫిక్ విభాగాన్ని మరో సారి కరోనా చుట్టుముట్టింది. తాజాగా అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ విభాగంలో ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు సిబ్బందికి జాగ్రత్తలు చెప్పడం ప్రారంభించారు. డ్యూటీ కి హాజరయ్యే సిబ్బంది చేత వేడి నీళ్లుతో పుక్కిలించేలా చేస్తున్నారు. తదనంతరం మాస్క్ ల అవేర్నస్ కోసం ప్రధాన జంక్షన్ లలో వాహనదారులకు చైతన్యం కల్పించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరరావు, ఏఎస్ఐ దాలినాయుడు ఇతర ట్రాఫిక్ సిబ్బంది చురుకుగా పాల్గొంటున్నారు.

Related posts

మద్యం దొరికింది..తాగాడు..భార్యను కొట్టాడు..చనిపోయాడు

Satyam NEWS

అది ప్రజా నిలయమా మీ పార్టీ భవనమా?

Satyam NEWS

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ

Satyam NEWS

Leave a Comment