విజయనగరంలో విచిత్రం..!..”సత్యం న్యూస్. నెట్” ఏం చెబుతుందని ఆసక్తి మీలో కలిగింది కదా….!అక్కడికే వస్తోంది. విజయనగరంలో సాయం సంధ్య వేళ.. అదీ చిన్న చిన్న గా చినుకులు పడుతున్న వేళ అదీ పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉన్న మూడు లాంతర్ల వద్ద… అస్తవ్యస్తమైన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్ సిబ్బందే…కార్పొరేషన్ సిబ్బంది చేయని పని చేసారు. అదీ రోడ్ కు అడ్డంగా ఉన్న ఆబోతులను.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్సీ శ్రీను ప్రసాద్ 115…కర్ర చేత పట్టి…అవులను తోలడం విశేషం.ట్రాఫిక్ క్రమబద్దీకరించాల్సిన ఆ ట్రాఫిక్ పోలీసులే….రోడ్ పై తిష్ట వేసిన ఆబోతులను అదీ చేతిలో స్టాపర్ పట్టుకోకుండా… పేద్ద కర్ర పట్టుకుని వాటిని తోలడాన్ని చూసిన నగర ప్రజ… ఓ వైపు మెచ్చుకుంటూనే మరో వైపు హేలన చేయడం విడ్డూరమే అని చెప్పాలి.
previous post
next post