39.2 C
Hyderabad
March 29, 2024 15: 26 PM
Slider హైదరాబాద్

మేయర్ పదవి రాకపోవడంతో అసంతృప్తిలో విజయా‘రెడ్డి’

#VijayaReddy

మేయర్ పదవికి అభ్యర్ధి ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కాంబినేషన్ ఆలోచించారో తెలియదు కానీ మేయర్ ఎంపిక కాగానే అసంతృప్తులు బయటపడ్డాయి.

ప్రజా నాయకుడు పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి మేయర్ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తనకు మేయర్ పదవి దక్కకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు.

మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలియగానే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అలకబూనారు.

ప్రమాణ స్వీకారం చేసి మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే ఆమె అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.

గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది.

ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించారు ఈసారి కూడా మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.

Related posts

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Bhavani

ఏళ్లు గడుస్తున్నా పేదల గోడు పట్టని ప్రభుత్వం

Satyam NEWS

కడప జిల్లాలో శ్రమదానంతో జనసేన రోడ్ల మరమ్మతులు

Satyam NEWS

Leave a Comment