28.2 C
Hyderabad
December 1, 2023 18: 38 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చిన రాములమ్మ

2276-vijaya

తాను పార్టీ మారుతున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై తెలంగాణ కాంగ్రెసు నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. విజయశాంతి బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసుతో విసిగిపోయిన ఆమె పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలను విజయశాంతి కొట్టిపారేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి టీఆర్ఎస్ ప్రబుత్వం సిద్ధమవుతోందని ఆమె విమర్శించారు. వార్డుల విభజనలో అవకతవకలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం బరితెగింపు బట్టబయలు అయిందని ఆమె అన్నారు. 

Related posts

మ్యూజిక్ సిట్టింగ్స్ లో రాజు బొనగాని బహు భాషా చిత్రం ఎంగేజ్మెంట్

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు

Satyam NEWS

వృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!