35.2 C
Hyderabad
May 29, 2023 20: 45 PM
Slider సినిమా

అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసిఆర్ కే సాధ్యం

తన పట్టుదల, ఆకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేస్తూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నిజం చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. “వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా” డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రసంసించారు.

“ఇప్పుడే ఒక అద్భుతం చూసాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు స్వయంగా చూసాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్ లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేసారు. నిజంగా చెప్పాలంటే కేసిఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు.. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికి ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నానంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ co-founder రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలీవుడ్ నటి మలైకా అరోరాకు గాయాలు

Sub Editor 2

లీగల్ హెరాస్మెంట్: లాక్ డౌన్ లో ఇంటికి లాక్

Satyam NEWS

సిఎం సహాయ నిధి చెక్కులను పంచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!