36.2 C
Hyderabad
April 23, 2024 21: 42 PM
Slider జాతీయం

నో స్లీప్:విక్రమ్ ల్యాండర్ విఫలం తో ప్రశాంతత కోల్పోయా

Narendra-Modi

సాంకేతిక కారణాలతో విక్రమ్ ల్యాండర్ విఫలమైనదని తెలిసి ఆ రాత్రి తాను నిద్రపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులతో నిర్వహించిన పరీక్ష పే చర్చకార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-2 లాంచ్ మిషన్ ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారని చెప్పారు. ప్రయోగ ఫలితం ఎలా ఉండబోతోందో తెలియదని, విఫలమైతే ఏంటనేది మరో సందిగ్ధత అని కానీ, ఇస్రోను సందర్శించాలనే తాను అక్కడకు వెళ్లానని తెలిపారు.

విక్రమ్ ల్యాండర్ ఇస్రో హెడ్ క్వార్టర్ తో సంబంధాలను కోల్పోయిందని శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత తాను ప్రశాంతంగా ఉండలేక పోయానని మరుసటి రోజు ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.

వారితో సమావేశం సందర్భంగా చంద్రయాన్-2 టీమ్ కృషిని అభినందించానని దీంతో, అందరి బాధ తొలగిపోయిందని చెప్పారు. అపజయాల నుంచి విజయాలను ఎలా సాధించాలో నేర్చుకోవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో ఘన విజయాన్ని సాధించబోతున్నామని చెప్పారు.

Related posts

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కు షోకాజ్ నోటీసు

Satyam NEWS

కాలనీలలో ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కరిస్తా

Satyam NEWS

దళితులపై దమన కాండ కొనసాగిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment