దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ఎన్ ఎస్ ఎస్ బృందాలకు ఇచ్చఅవార్డులలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ద్వితీయ స్ధానం సాధించింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ . సుదర్శన రావు ట్రోఫీని అందుకున్నారు. వెండి పతకం, ధ్రువీకరణ పత్రం రూ . 2లక్షల నగదును ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డా” కె .రమేష్ రెడ్డి అందుకున్నారు. జాతీయ సేవా పథకంలో దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు కనబరిచిన వారికి ఎన్ ఎస్ ఎస్ అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ అత్యుత్తమ ప్రతిభా బృందాలకు రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డును అందిస్తారు. విద్యార్ధులలో సేవా నిరతిని, సమాజం పట్ల చూపించాల్సిన అంకిత భావాన్ని ఎన్ ఎస్ ఎస్ నేర్పుతుంది. సమాజంలో విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో ఎన్ ఎస్ ఎస్ సేవలు ఎంతో అవసరం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో విద్యార్ధులకు తర్పీదు ఇవ్వడంతో మొదలయ్యే ఈ కార్యక్రమం ఇప్పటికే ఎందరికి కో స్ఫూర్తిని పంచింది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్ధులకు నిరంతర సేవాభావ కార్యక్రమాలను అలవాటు చేయడం ఎంతో ప్రశంసాపూర్వకమని అందరూ అభినందిస్తున్నారు. తమ ఎన్ ఎస్ ఎస్ బృందం జాతీయస్ధాయిలో ద్వితీయ స్ధానం దక్కించుకోవడం ఆనందంగా ఉందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు అన్నారు. ఇందుకు కారకులైన వారందరికి అందరికి ఆయన అభినందనలు తెలిపారు.
previous post
next post