గ్రామాలు అభివృద్ధి పరిచే కార్యక్రమం లో రాజకీయాలు ఉండరాదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన గ్రామ పంచాయతీలకు రెండో విడత ట్రాక్టర్ల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. గ్రామ సర్పంచుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక సంబంధించిన అంశాలను తెలియజేశారు. అనంతరం అక్కడి ప్రజలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు వేరు గ్రామాల అభివృద్ధి వేరని ఆయన అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం 30రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపట్టారన్నారు. అదే విధంగా రెండో విడత ట్రాక్టర్ల పంపిణి ద్వారా గ్రామ గ్రామ పంచాయతీ నిధుల నుండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. తదనంతరం కొల్లాపూర్ పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాలకు సంబంధించిన గ్రామాలకు 10 ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

ముందుగా సంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ట్రాక్టర్ నడిపి అందరిని ఆకట్టుకున్నారు. ఆయా గ్రామ సర్పంచ్ లకు ట్రాక్టర్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ జడ్పిటిసి జూపల్లి భాగ్యమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సింగల్ విండో ఛైర్మన్ రఘుపతి రావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ హనుమంతు, జిల్లా జెడ్పి కోఆప్షన్ సభ్యులు మతిన్, టిఆర్ఎస్ మండల నాయకులు ముచ్చర్ల రాం చందర్ యాదవ్ వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.