31.2 C
Hyderabad
April 19, 2024 04: 11 AM
Slider నల్గొండ

రాజకీయాలకు అతీతంగా పల్లెల అభివృద్ధి

#jagadishreddy

గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి అని ,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి  ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో  జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో దిన్ దయల్ ఉపధ్యాయ్ పంచాయతీ సతల్ వికాస్  జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా మండల స్థాయి ఉత్తమ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్, ఆదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ లతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గ్రామాలు పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయని అన్నారు.  జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతిలలో సర్పంచుల ఆధ్వర్యంలో  ఎనలేని అభివృద్ధి జరుగుతుందని సూర్యాపేట నియోజక వర్గం పరిధిలో 4 మండలాల్లో 113 గ్రామ పంచాయతీ లకున్ లలో 86 గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో నిలవడం సర్పంచుల పని తీరుకు నిదర్శనమని అభినందించారు.

జిల్లాలోని 475 జి.పి లలో  621 రంగాలలో 343  జిపి లకు అవార్డులు లభించాయని అన్నారు.  ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, నర్సరీలు, ట్రాక్టర్లు, మిషన్ భగీరథ  మరెన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీ లను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని జి.పిలలో  అభివృద్ధి వేగంగా విస్తరిస్తుందని ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో బాగస్వములు కావాలని జిల్లాకు ఇన్ని అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందని సర్పంచులు, కార్యదరులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి వైస్ ఛైర్మన్ గోపగని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, జెడ్.పి సి.ఈ. ఓ సురేష్, ఎంపీపీ లు,జడ్పీటీసీ లు, సర్పంచులు ఎంపీడీఓ లు, mpo లు , కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నిరుద్యోగ భృతిలో ప్ర‌భుత్వం విఫ‌లం బీజేవైఎం

Sub Editor

Free Trial Nitroxin Male Enhancement Creme Reviews Have A Bigger Dick

Bhavani

కరోనా వ్యాప్తిపై వైసీపీ నేతలు, అధికారుల నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment