31.7 C
Hyderabad
April 25, 2024 02: 22 AM
Slider శ్రీకాకుళం

పెద్ద పాడు గ్రామం లో నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి

#PedapaduSchool

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్ద పాడు గ్రామం లో ప్రాథమిక పాఠశాల కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలో 2 గదులలోనే  ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు.

పెద్ద పాడు గ్రామం నుంచి జాతీయ రహదారి  మీదుగా ఒక కిలోమీటర్  ప్రయాణించి దూరంగా ఉండే ఉన్నత పాఠశాల చేరుకోవాల్సి వస్తున్నది.

దీంతో విద్యార్థులు విద్యార్థులు, తల్లిదండ్రులు  రోజు ప్రాణ భయంతో ఉంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇద్దరు ప్రమాద బారిన పడి చనిపోయారు కూడా.

అదేవిధంగా  కొంతమంది విద్యార్థులు జాతీయ రహదారి దాటుతుండగా  ప్రమాదాల బారిన పడ్డారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఈ పాఠశాల పై దృష్టి సారించి నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలని తల్లిదండ్రులు  కోరుతున్నారు.

Related posts

గుంటూరు తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు సాయం

Bhavani

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామ వాలంటీర్ల ధర్నాలు

Satyam NEWS

ఢిల్లీ నుంచీ గ‌ల్లీ దాకా…! రామ‌తీర్ధానికి కేంద్ర మంత్రి మాండ‌వీయ‌….!

Satyam NEWS

Leave a Comment