గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని గ్రామాలకు సంబంధించిన పంచాయితీల సమస్యలను ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. తెలంగాణా పంచాయితీ రాజ్ యాక్టు సెక్షన్ 141 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటయింది. చైర్మన్, ఇతర సభ్యుల టర్మ్ మూడేళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్, ఇతర సభ్యులకు రెమ్యునరేషన్ చెల్లించి, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.