ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి గ్రామ సచీవాలయాల ఏర్పాటు పనులు ప్రారంభం అవుతాయి. గ్రామ సచివాలయాలకు నవంబర్ నెలాఖరు నాటికి అన్ని సదుపాయాలు అందుతాయి. డిసెంబర్ 1 నాటికి గ్రామ సచివాలయాలు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరులకు అందే విధంగా ఏర్పాటు చేస్తారు. గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వివక్ష, పక్షపాతం లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు సేవలు అందాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, 72 గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు లాంటి సేవలు అందాలని ఆయన నిర్దేశించారు. ఇది జరిగితే ఒక మంచి మైలురాయిని మనం అందుకున్నట్టేనని సిఎం అన్నారు. దీనికి సంబంధించిన యంత్రాంగం గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాలని ఆయన అన్నారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పుఅని ఆయన అన్నారు
previous post
next post