40 రోజుల వ్యవధిలో 2.5 లక్షలమంది గ్రామ వాలంటీర్ల ను నియమించడం ఒక రికార్డు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంతటి భారీగా నియామకాలు జరగలేదు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాల ప్రక్రియకూడా ముమ్మరంగా సాగుతోంది అని ఆయన తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందువల్ల పరీక్షల రాసేవారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆయన అన్నారు. వీరి ఎంపిక చాలా పారదర్శకంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు దీనిపై శ్రద్ధపెట్టి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను ప్రారంభిస్తాను, మండల స్థాయిలో ఎమ్మెల్యేలు, మండలస్థాయి అధికారులు ప్రారంభిస్తారు అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సెక్రటేరియటర్‌కు, ప్రజలకు మధ్య వారధి వాలంటీర్లేనని, ప్రతి పథకాన్ని డోర్‌డెలివరీ చేసేది వీళ్లేనని సిఎం అన్నారు. అందుకే వీరికి శిక్షణ, అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా వారితో అడుగులు వేయించే బాధ్యత మనది అని ఆయన అన్నారు.
previous post
next post