30.7 C
Hyderabad
April 16, 2024 23: 04 PM
Slider వరంగల్

నిక్షేపంగా ఉన్నాడు…. ఒక్క రోజులో పోయాడు

#Ramanakar

కరోనా సోకి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న ఒక యువకుడు అకస్మాత్తుగా మరణించడంతో ములుగు జిల్లా ఇంచర్ల గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఇంచర్ల గ్రామానికి చెందిన బాలిని రమణాకర్ (33) గత పది రోజుల క్రితం ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోన  నిర్ధారణ పరీక్ష చేయించాడు. అతనికి కరోనా పాజిటివ్ గా  నిర్ధారణ అయింది. తక్కువ రోగ లక్షణాలు ఉండటంతో కరుణాకర్    ఇంటివద్దనే హోం క్వారంటైన్ లోనే  ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి  కాగా కుటుంబ సభ్యులు  రమణాకర్ ను ములుగు ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వెంటనే అక్కడి వైద్య శిబ్బంది చికిత్స అందించడం ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రమణాకర్ పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి 11 గంటల  సమయంలో మృతి చెందాడు. కాగా మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రమణాకర్ మరణ వార్తతో ఇంచర్ల గ్రామంలో విషాదం నిండిపోయింది. రమణాకర్ కరోనా తో  మృతి చెందిన విషయం గ్రామంలో  మంగళవారం  ఉదయం తెలియడంతో ఒక్క సారిగా జనం హతాశులయ్యారు. అందరితో కలివిడిగా  ఉండడంతోపాటు మృదువైన స్వభావి ఆయన రమణాకర్ మృతి చెందిన విషయం తాము జీర్ణించుకోలేకపోతున్నామని వారన్నారు. రమణాకర్  మృతదేహాన్ని ఇంచర్ల గ్రామ స్మశానవాటికలో కోవిడ్ నియమాలను అనుసరిస్తూ అంత్యక్రియలు పూర్తి చేసినట్టు గ్రామ సర్పంచ్ మొర రాజయ్య  తెలిపారు.

Related posts

Tragedy: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఘోరం

Satyam NEWS

క్రీడాకారులకు ములుగు జెడ్పీ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

సమ్మె లో లేని వారికి వెంటనే జీతం విడుదల

Satyam NEWS

Leave a Comment