28.7 C
Hyderabad
May 15, 2024 01: 00 AM
Slider కడప

కరోనా కలకలం: ఖననానికి అడ్డు చెప్పిన గ్రామస్తులు

#Nandaluru Corona Case

కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరు కు చెందిన పుష్పాలత (50) క్యాన్సర్ తో పూణే లో మృతి చెందింది. మధ్యలో మృతురాలి కి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. పుష్పాలత మృతదేహం ను సోమవారం కుటుంబ సభ్యులు అధికారుల సహాయంతో స్వగ్రామం కు మూడు కిలో మీటర్ల దూరంలో ఖననం చేశారు.

ముందుగా చెయ్యేటి లో ఖననం చేయడానికి ప్రయత్నాలు చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు కడ్డంగా ముళ్ల కంచెలు వేశారు. దీనితో రాజంపేట డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఒంటిమిట్ట సి.ఐ.హను మంతు నాయక్, నందలూరు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,ఎమ్మార్వో రవిశంకర్ రెడ్డి లు వారికి నచ్చ జెప్పే ప్రయత్నాలు చేసి ఫలించలేదు.

దాంతో గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీశాఖ సమీపంలో పుష్పాలత మృతదేహం ను భర్త రాజు గౌడ్, కుమారుడు పవన్,తల్లి మంగమ్మ ల ఆధ్వర్యంలో అధికారుల సహాయంతో అటవీ ప్రాంత సమీపంలో ఖననం చేశారు.  భర్త, కుమారుడు, తల్లీ తో పాటు పూణే నుంచి వచ్చిన ఇద్దరు అంబులెన్స్ సిబ్బందిని కడప పాతిమా కాలేజీ లోని క్వారైన్ టైన్ కు తరలించారు. దీనితో అధికారులల్లో ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠత తొలగిపోయింది.

Related posts

న్యాయవ్యవస్థపై దాడి ఫ్యాషన్ అయిపోయింది

Satyam NEWS

సినీ నటి మాధవి లతపై సైబర్ పోలీసుల కేసు

Satyam NEWS

రూట్ల ప్రైవేటీకరణపై కూడా కేసీఆర్ దే పైచేయి అవుతుందా?

Satyam NEWS

Leave a Comment