27.7 C
Hyderabad
April 18, 2024 10: 20 AM
ఆధ్యాత్మికం

ఈ కథ వింటే విఘ్నాలు దరి చేరవు

#Lord Ganesha

వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభాయ అంటే ఆర్థులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. కార్యం నిర్విఘ్నంగా జరిగేందుకు వినాయకుడు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం.

బుద్ధిబలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ. ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం. గణపతిని పూజించడానికి వినాయక చవితినాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది.

సిద్ధిని బుద్ధిని ప్రసాదించే దేవుడు

గణపతి.. ప్రథమ దేవుడు.. ఏ కార్యానికైనా అవరోధాలను తొలగించి సిద్ధినీ.. బుద్ధినీ ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద ప్రమాణం. పూజగానీ.. యజ్ఞంగానీ లోక కల్యాణం కోసం చేస్తారు. ఆరాధించే దేవతా గణానికీ.. మంత్ర సమూహానికీ.. యాజ్ఞికుల బృందానికీ ప్రభువై.. ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతిగా చెప్పుకుంటారు.

సమస్త చేతన.. అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరిపినప్పటికీ భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజే ఎందుకంటే.. అది వినాయకుడు పుట్టినరోజు.. ఇంకా విఘ్నరాజత్వం సంప్రాప్తించిన రోజు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మహదాదితత్తాలకు ఆయన అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు.

ఒక రోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి ‘ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరుతారు. అందుకు తామే సరైన వారిమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడతారు. అప్పుడు.. పరమేశ్వరుడు.. ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. ‘మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో.. వారే ఈ పదవికి అర్హులు’ అని చెబుతాడు.

అసాధ్యమైన కార్యాన్ని సాధించిన ఘనుడు

దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్లిపోతాడు. వినాయకుడు మాత్రం.. తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తిచేయగలను అనే సందేహాన్ని శివుడి ముందుంచుతాడు. అపుడు శివయ్య.. తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెబుతాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలుపుతాడు.

ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఆ మంత్రాన్ని ముల్లోకలములకు సమానమైన తల్లీదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో.. కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు.

అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి.. ‘తండ్రి, అన్న మహిమ తెలియక తప్పు చేశా.. నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి’ అన్నాడు.

అలా బాధ్రపద శుద్ధ చవితిరోజున గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజున భక్తులందరూ భోజనప్రియుడైన వినాయకుడికి పిండివంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపళ్లు ఇలా నైవేద్యం పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్నీ కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వడంతో.. వినాయకుడి పొట్టపగులుతుంది.

అది చూసి పార్వతి దేవి శాపం ఇవ్వడం. ఆ తర్వాత రుషి పత్నులు నీలాపనిందలు మోయడం. ఆ పై పార్వతి దేవి… వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందలు పాలు కారని చెబుతారు. అందుకే వినాయక చవితి రోజు.. వినాయకుని కథ చదివి, అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందలు ఉండవని పెద్దలు చెబుతారు. సత్యం న్యూస్ వినాయక చవితి శుభాకాంక్షలు.

Related posts

మే 11 నుంచి 17 వరకూ అన్నవరం సత్యదేవుని కళ్యాణం

Satyam NEWS

స్వయం ప్రకాశుడు, విశుద్ధ జ్ఞాన స్వరూపుడు

Satyam NEWS

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

Satyam NEWS

Leave a Comment