25.7 C
Hyderabad
June 22, 2024 05: 26 AM
Slider సినిమా

మంగత్రయి నీరజ్ జ్యువలరీ లో వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్ కలెక్షన్

#rasikhanna

మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీనటి రాశి ఖన్నా అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని జ్యువెల్ మాల్ లో ఉన్న  మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో శనివారం “వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్” పేరుతో ప్రత్యేక కలెక్షన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాశి ఖన్నా అక్కడ ఏర్పాటు చేసిన పలు ఆభరణాలను ధరించి సందడి చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మన సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఇక్కడ రూపొందించిన ఆభరణాలు తనకింతగానో నచ్చాయన్నారు. ప్రతి మగువ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతుందని అలాగే తనకు కూడా ఆభరణాలు ధరించడం ఇష్టమేనని అన్నారు. అయితే సందర్భానుసారంగా తన అలంకరణ ఉంటుందన్నారు. డిజైనర్ నయన్ గుప్తా రూపొందించిన ఈ ఆభరణాలు ప్రత్యేక రీతిని కలిగి ఉన్నాయని అన్నారు. మగువల, యువత మనసును ఇవి ఖచ్చితంగా దోచుకుంటాయన్నారు.

నయన్ గుప్తా మాట్లాడుతూ మగువల ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పలువురు మోడల్స్ నగలను ధరించి హొయలు పోయారు.

Related posts

కులాల రొష్టులో పడ్డ ఈ కమలం వికసించేనా?

Satyam NEWS

చిన్న తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆదాయం కోటిన్నర

Satyam NEWS

చేనేతను ధరించండి..ఆ రంగ కార్మికులను ప్రోత్సహించండంటున్న…!

Satyam NEWS

Leave a Comment