27.7 C
Hyderabad
April 19, 2024 23: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఛిల్ ఛిల్ ఛిల్ అంటూ చల్లబడ్డ లంబసింగి

lambasingi

దక్షిణాది కాశ్మీర్ గా రూపుదిద్దుకుంటున్న లంబసింగి లో మళ్లీ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో మంచు అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు లంబసింగి, చెరువులవేనం ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల నవంబరు మొదటి పక్షంలోనే విశాఖ మన్యం ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యకు పడిపోయాయి. ఈ ఏడాదిలో తొలిసారిగా చింతపల్లిలో బుధవారం 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచు దట్టంగా కురుస్తోంది. విశాఖ మన్యంలో చలి ప్రజలను వణికిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి.

Related posts

చేతకాని వ్యవసాయ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS

లాక్ డౌన్ ఖాళీతో ఎల్బీనగర్ ఎడమ ఫ్లైఓవర్ నిర్మాణం

Satyam NEWS

ఖైరతాబాద్ గణనాధ విగ్రహ తయారీ పూజ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment