వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా రాష్ట్రా స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు చేస్తున్న ఏర్పాట్లను ప్రణాళికా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తో కలసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ శుక్రవారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారన్నారు. ఈ కార్యక్రమం 13 వ తేదీ ఉదయం 9.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.40 గంటల సమయానికి ముగుస్తుందన్నారు. మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో ముఖ్యమంత్రి ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతానికి రాష్ట్రా స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించిన పనులను చక్కగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతాంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎస్.ఓ.పి.ని, చెక్ లిస్టును రూపొందించి అందరికీ కమ్యునికేట్ చేయడం జరిగిందన్నారు. వాటికి అనుగుణంగా శాఖల వారీగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు దాదాపు 30 వేల మంది వరకూ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారన్నారని సిఎస్ పేర్కొన్నారు.
మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు విద్యార్థులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖ వర్గాల నుండి పలువురు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారన్నారు. అయితే ఆయా వర్గాలను ప్రతి జిల్లా నుండి 13 వ తేదీ ఉదయానికి విజయవాడ తీసుకు రావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు వహించాలన్నారు. వారి రాకపోకలకు తగిన రవాణా సౌకర్యాలతో పాటు తగిన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటును ఇప్పటికే అప్పగించిన రాష్ట్రా స్థాయి అధికారులు చూసుకోవాలన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో జిల్లాల నుండి ప్రజలు, అధికారులు, ప్రత్యేక బృందాలు విజయవాడకు తరలి వస్తున్న నేపథ్యంలో ఎటు వంటి శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికాపరులను ఆయన ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతు అధికారులకు అప్పగించిన పనులను వివరిస్తూ వాటిని పటిష్టంగా నిర్వహించాలని, సకాలంలో ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేయాలని కోరారు.
సమావేశంలో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా డిజిపి ద్వారకాతిరుమల రావు,రెవెన్యూ,జల వనరులు, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా,జి.సాయి ప్రసాద్,యం.టి.కృష్ణబాబు, సిఆర్డిఏ కమీషనర్ కె.భాస్కర్, వైఏటిసి కార్యదర్శి వినయ్ చంద్,ఐఅండ్ పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితర అధికారులు పాల్గొన్నారు.