28.7 C
Hyderabad
April 25, 2024 04: 59 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం

#Tirumala Balajee

లోక‌క‌ల్యాణం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా “ఓం నమో నారాయణాయ” అష్టాక్షరి మంత్రాన్ని, “ఓం నమో భగవతే వాసుదేవాయ” ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించి హోమం నిర్వహించారు.

అంతకుముందు సుదర్శన చక్రానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు మంగ‌ళాశాస‌నాలు అందించారు. ఈ యాగంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ప్ర‌పంచ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం మొద‌ట‌గా ధ‌ర్మ‌గిరిలో ధ‌న్వంతరి మ‌హాయాగాన్ని టిటిడి నిర్వ‌హించింద‌ని, ఆ త‌రువాత చ‌తుర్వేద పారాయ‌ణం, పార‌మాత్మ‌కోప‌నిష‌త్ పారాయ‌ణం, యోగ‌వాశిస్టం పారాయ‌ణం జ‌రిగాయ‌ని వివ‌రించారు.

స్వామివారి ఆశీస్సుల‌తో నిర్వ‌హించిన ‌విశ్వ‌శాంతి మ‌హాయాగం వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయ‌ని తెలిపారు. వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ క‌రోనా వ్యాధి నుండి మానవాళిని రక్షించాలని కోరుతూ వేదపాఠశాలలో 30 రోజులుగా వేదపారాయణం జరుగుతోంద‌న్నారు.

మంగ‌ళ‌వారం  రేవ‌తి, అశ్విని న‌క్ష‌త్రాలు క‌లిసిన‌ భౌమాశ్విని యోగం ప‌ర్వ‌దినం కావ‌డంతో విశ్వశాంతి మహాయాగాన్ని పూర్ణాహుతితో పూర్తి చేశామ‌న్నారు. ఇందులోభాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం,  కృష్ణ యజుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ నారాయణం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీమద్రామాయణ పారాయణం సుందరకాండ పారాయణం చేప‌ట్టిన‌ట్టు చెప్పారు.

యాగాన్ని నిర్వ‌హించిన వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు మోహ‌నరంగాచార్యులు మాట్లాడుతూ  “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రాన్ని, “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ప‌ఠించిన వారికి శ్రీ‌వారి ఆశీస్సుల‌తో బాధ‌లు తొల‌గిపోయి, స‌క‌ల‌శుభాలు క‌లుగుతాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నాటకలో గోవధ నిషేధ ఆర్డినెన్సు జారీ

Satyam NEWS

కాకతీయ కాల్వలో ఇద్దరు యువకుల గల్లంతు

Satyam NEWS

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు పితృవియోగం

Satyam NEWS

Leave a Comment