30.7 C
Hyderabad
April 17, 2024 02: 34 AM
Slider ప్రపంచం

ప్రతి రోజూ 20 నిమిషాలు ఎండలో కూర్చోండి

#Vitamin D

రోజూ 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. లేకపోతే శరీరంలో విటమిన్ డి తగ్గిపోతుంది. విటమిన్ డి తగ్గిపోతే ఏమిటని అనుకుంటున్నారా? విటమిన్‌-డి లోపం ఉన్నవారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా శ్వాస వ్యవస్థను కాపాడటంలో విటమిన్‌-డి ఇతోధికంగా దోహదపడుతున్నట్టు గత పరిశోధనల్లోనూ వెల్లడైంది.

కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో దీని పాత్ర ఏమిటన్నది తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో మెడిసిన్‌ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేపట్టారు.

మహమ్మారికి ముందు, ఆ తర్వాత 489 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. విటమిన్‌-డి స్థాయి తగినంతగా ఉన్నవారితో పోలిస్తే  ఈ లోపంతో బాధపడుతున్నవారే ఎక్కువగా కొవిడ్‌కు గురైనట్లు గుర్తించారు.

Related posts

బాంబు దాడిలో  15మంది పిల్లలు మృతి

Murali Krishna

చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా ప్రమాణం

Bhavani

దాసన్నపేట దోపిడి మ‌ర్చిపోక ముందే విజ‌య‌న‌గ‌రంలో మ‌రో భారీ చోరీ…!

Satyam NEWS

Leave a Comment