18.7 C
Hyderabad
January 23, 2025 03: 32 AM
Slider ప్రకాశం

కరోనా కాలంలో కూడా ఆర్ధిక మండలి విశేష ప్రగతి

#vizag

విశాఖపట్నంలోని ప్రత్యేక ఆర్దిక మండలి కరోనా విపత్కర పరిస్దితులలో కూడా గణనీయమైన ప్రగతి సాధించిందని విశాఖపట్నం ప్రత్యేక ఆర్దిక మండలి డెవలప్ మెంట్ కమీషనర్ ఏ.రామమోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలు గుళ్లాపల్లి వద్ద ఉన్న నిర్మాణ సెజ్ ను సోమవారం ఆయన సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రత్యేక ఆర్దిక మండలిని 1989లో ఏర్పాటు చేశారని, ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ప్రత్యేక ఆర్దిక మండళ్ల కంటే విశాఖపట్నం ఆర్దిక మండలి ఉద్యోగ కల్పన,వాణిజ్య ఎగుమతుల్లో 32 శాతం అభివృద్ది సాధించిందన్నారు.

విశాఖ ఆర్దిక మండలి పరిధిలో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో  569 యూనిట్లు ఉన్నాయని, వీటి ద్వారా దాదాపు 4లక్షల 50వేల మంది ప్రత్యేక్షంగా మరొక నాలుగు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఆగస్టు నాటికి 44వేల 77వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేయడం జరిగిందన్నారు.

విశాఖ ఆర్దిక మండలి పరిధిలో ఒంగోలులోని బిల్డింగ్ ప్రాడక్ట్ సెజ్ అతి ముఖ్యమైనదన్నారు. ఇక్కడ నుంచి నాణ్యమైన గ్రానైట్ ఎగుమతి జరుగుతుందన్నారు. ఇక్కడ 21 యూనిట్లు ఉన్నాయని వీటి ద్వారా గతేడాది 653 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ ఎగుమతి చేయడం జరిగిందని తెలిపారు. కరోనా ప్రతికూల పరిస్దితుల్లోనూ ఇక్కడి గ్రానైట్ పరిశ్రమ మంచి పురోగతి సాధించిందని, ఈ ఏడాది ఇప్పటివరకు 22 శాతం అభివృద్ది నమోదైందన్నారు.

ఇప్పటివరకు 294 కోట్ల రూపాయల మేర ఎగుమతులు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన 400 బిలియన్ డాలర్ల వ్యాపార సాధనలో విశాఖపట్నం ఆర్దిక మండలి ఎంతో కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఫార్మా ఎగుమతులు ఎంతో బాగున్నాయన్నారు. సర్వీసు రంగం కంటే వాణిజ్య రంగంలోనే విశాఖపట్నం ఆర్దిక మండలి ఎంతో ప్రగతి సాధించిందన్నారు.

వాణిజ్య రంగంలో అభివృద్ది 26 శాతంగా నమోదైందన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ రామమోహన్ రెడ్డి, సెజ్ లోని యూనిట్ల యజమానులతో వారి సమస్యల గురించి చర్చించారు. ఆర్దిక మండలి ద్వారా వారికి కావాల్సిన సహాయ,సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. సెజ్ లోని కొన్ని యూనిట్లను కూడా ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట ప్రత్యేక ఆర్దిక మండలి అసిస్టెంట్ డెవలప్ మెంట్ కమిషనర్ కె. ప్రసన్నకుమార్, కస్టమ్స్ స్పెసిఫైడ్ ఆఫీసర్ చరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లీగ్ జిల్లా పోటీలు ప్రారంభం

Satyam NEWS

విభజన సమస్యలపై 23న సమావేశం

Murali Krishna

ఒక పోలీసు చెప్పిన కథ: అన్నం శ్రమ జీవుల కష్టం

Satyam NEWS

Leave a Comment