విశాఖపట్టణంలో స్పా మరియు మసాజ్ సెంటర్ల పేరుతో సాగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దృష్టి సారించారు. నిబంధనలకు వ్యతిరేకంగా మసాజ్ సెంటర్ల నిర్వహణపై విశాఖ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక కాలంలో 71 స్పాలపై పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. మరో 21 స్పా నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారనే ఫిర్యాదు తో విశాఖ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురు అమ్మాయిలు అదువులోకి తీసుకున్నారు.