37.2 C
Hyderabad
March 29, 2024 20: 00 PM
Slider విశాఖపట్నం

తీర ప్రాంతంలో విశాఖ రేంజ్ డీఐజీ పర్యటన

#vizagrange

విశాఖ రేంజ్ పరిధిలో “గులాబ్’ తుపాను సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.12 గంటల పాటు ఉత్తరాంధ్ర ను మరీ ముఖ్యంగా విజయనగరాన్ని అతలాకుతలం చేసింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం సంభవించిన హుదూద్ తుపాను ను తలపించింది. ఏకంగా రాష్ట్ర సీఎస్ స్వయంగా వచ్చి పరిస్థితి సమీక్షించారంటే “గులాబ్” తుపాను ఎంత మేర వణికించిందో ఆర్థమవుతోంది. ఇక రెవెన్యూ యంత్రాంగం తో పాటు పోలీసులు కూడా పరిస్థితి పరిశీలించేందుకు పర్యటనలు చేశారు.

ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు… నేరుగా విజయనగరం వచ్చి కలెక్టరేట్ లో కలెక్టర్ సూర్యకుమారి తో సమావేశమైన అనంతరం ఎస్పీ దీపికా తో పాటు విజయనగరం డీఎస్పీ అనిల్ తో భోగాపురం పరిధిలోని ముక్కాం, పూసపాటిరేగ ప్రాంతాలను పరిశీలించారు.గులాబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడటం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులపై చెట్లు పడి, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం, వరద నీటికి రోడ్లు కొట్టుకొని పోవడం, తీర ప్రాంత గ్రామాల్లో మత్సకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం క్రియాశీలకంగా పని చేసింది.

బొండపల్లి మండలంలో రామన్న చెరువు నిండిపోవడంతో జాతీయ రహదారి పైకి నీరు వరదలా ప్రవహించి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గజపతినగరం సిఐ డి.రమేష్ ఆధ్వర్యంలో బొండపల్లి ఎసై వాసుదేవ్ మరియు బొండపల్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫానులో పంక్చర్ అయి ఆగిపోయిన కారులో ఇబ్బంది పదుతున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్తానాలకు చేర్చేందుకు వర్షంలో సైతం పోలీసులు పంపి, మరమ్మత్తులు చేపట్టారు.

అదే విధంగా పలు పోలీసు స్టేషను పరిధిలో రహదారులపై ఈదురు గాలుల కు చెట్లు పడిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే, స్పందించిన స్థానిక పోలీసులు జెసిబిలు, స్థానికుల సహాయంతో చెట్లును తొలగించి, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించారు. అనంతరం ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందితో, మత్సకారులతో మాట్లాడారు. మత్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

Related posts

ద్వారకా తిరుమలలో ముగిసిన మహా పాశుపత హోమం

Satyam NEWS

టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కాగడాల ర్యాలీ

Satyam NEWS

అర్ధారాత్రి రాజకీయంతో గద్దెనెక్కిన ఫడ్నవీస్

Satyam NEWS

Leave a Comment