22.2 C
Hyderabad
December 10, 2024 10: 15 AM
Slider ప్రత్యేకం

ఆశ్రమానికి తాళం.. పారిపోయిన జగన్ రెడ్డి గురువు

#saradapeetham

అబ్బో… మొన్నటిదాకా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి దక్కిన సర్కారీ మర్యాదలు చూసి కేబినెట్ మంత్రులు కూడా ఒకింత ఈర్ష్య పడేవారు. ఎందుకంటే… ఇహపర సుఖాలకు అతీతంగా జీవనం సాగించే స్వామీజీకి వై కేటగిరి భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రీన్ చానెల్ సౌకర్యం, ఎక్కడ కోరితే అక్కడ భూములు, ఏకంగా తిరుమల కొండపై అయితే తాను అనుకున్నట్టుగా భవనాల నిర్మాణం…అంతేనా అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇటు ఏపీ సీఎం జగన్ ల రాకలతో నిత్యం శారదా పీఠం కళకళలాడిన తీరు నిజంగానే అబ్బురమనిపిస్తుంది.

అయితే ఇప్పుడా రాచ మర్యాదలన్నీ గాయబ్ అయిపోయాయి. వై కేటగిరి భద్రత కాస్తా… ఎక్స్ కేటగిరీకి తగ్గిపోగా… ఆ కనీస భద్రత కూడా తనకు అవసరం లేదంటూ స్వరూపానంద నేరుగా ఏపీ సర్కారుకు లేఖ రాశారు. తాను హిమాలయాలకి వెళుతున్నానని, ఇకపై ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకుంటున్నానని, ఈ క్రమంలో సర్కారు కల్పిస్తున్న భద్రత తనకు అవసరం లేదని ఏపీ డీజీపీకి రాసిన లేఖలో స్వరూపనంద తెలిపారు.

అంటే… మొత్తంగా తన మకాంను విశాఖ నుంచి హిామాలయాలకు మారుస్తున్నట్లుగా స్వరూపానంద చెప్పకనే చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి విశాఖ కేంద్రంగానే ఓ మోతాదు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి… వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా అప్పటికే తెలంగాణ సీఎంగా కొనసాగుతున్న కేసీఆర్ భక్తి వల్ల దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లారని చెప్పాలి. 2019 ఎన్నికల్లో నీకు గెలుపు తథ్యమంటూ జగన్ భుజాన్ని తట్టిన స్వరూపాందుడు… ఎన్నికల ఫలితాలు రావడం, తాను చెప్పినట్గుగానే జగన్ ఘన విజయం సాదించడంతో ఒక్కసారిగా టాప్ ప్రయారిటీ జాబితాలో చేరిపోయారు.

అప్పటికే తిరుమలలో వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు కేటాయించిన భూముల్లో తనకు ఇష్టం వచ్చిన తీరిలో భవనాలను నిర్మిస్తానంటే… జగన్ అందుకు సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా… విశాఖలో పీఠాన్నిమరింతగా విస్తరిస్తానని ప్రతిపాదన పెట్టిందే ఆలస్యం… నగర పరిదిలో వందల కోట్లరూపాయల విలువ చేసే 15 ఎకరాలను జగన్ సర్కారు పీఠానికి కేటాయించింది. ఇక జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలంతా వరుసబెట్టి పీఠానికి క్యూ కట్టడంతో స్వామీజీ మఠానికి ఉత్తరాధికారిని నియమించారు.

తనతో పాటుగా ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్రకు కూడా సర్కారు భద్రతను కేటాయిచింది. వెరసి జగన్ సర్కారుకు స్వరూపానంద రాజగురువుగా మారిపోయారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటం సాధ్యం కాదు కదా. సీఎం హోదాలో జగన్ తీసకున్న నిర్ణయాలపై నిప్పులు చెరిగిన ఏపీ జనం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు. వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చి… అవే ఎక్కువ అన్న తీర్పు ఇచ్చారు.

వెరసి అప్పటిదాకా అధికారం వెలగబెట్టిన జగన్ షాక్ లో కూరుకుపోగా… రాజ గురువుగా రాజ్యమేలిన స్వరూపానంద కూడా తన ఉనికి ప్రశ్నార్థకం కానుందా? అన్న దిశగా ఆలోచనలో పడిపోయారు. తాను అనుకున్నట్లుగానే తనకు విశాఖలో కేటాయించిన 15 ఎకరాల భూమిని కూటమి సర్కారు రద్దు చేయడం, ఆ వెంటనే తిరుమలలో తాను కడుతున్న నిర్మాణాలను నిలుపుదల చేయడంతో పాటుగా వాటిని కూల్చివేయాలని తీర్మానించడంతో స్వరూపానంద ఇక తన పప్పులు ఉడకవని గ్రహించారు.

ఇంకా విశాఖలోనే ఉంటే… వైైసీపీ నేతల మాదిరే తనకూ శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుందని అనుకున్నారో…ఏమో తెలియదు గానీ… ఒక  స్వామీజీగా హిమాలయాలకు వెళ్లడమే మంచిదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా హిమాలయ ప్రయాణానికి స్వరూపానంద సిద్ధమైపోయారు. అయితే రాజ గురువు హోదాలో సర్కారు నుంచి భద్రతను పొందుతున్న స్వరూపానంద గుట్టు చప్పుడు కాకుండా విశాఖను వీడి పోలేరు కదా. అలాగని సర్కారు తనకు ఇచ్చిన భద్రతను వెంటేసుకుని మరీ హిమాలయాలకు వెళ్లలేరు కదా.

అందుకే కాబోలు… తన హిామాలయాల యాత్రను స్వరూపానందుడు తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారుకు తెలియజేయాల్సి వచ్చింది. హిమాలయాలకు వెళుతున్న తనకు ఇక సర్కారీ భద్రత అవసరం లేదని, అంతేకాకుండా ఇకపై ఎక్కువ కాలం పాటు హిమాలయాల్లోనే గడపాలనుకుంటున్నానని… ఈ కారణంగా ఇకపై తనకు భద్రత అవసరం లేదని చెప్పిన స్వరూపానంద ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఒకవేళ సర్కారీ భద్రత లేకపోయి ఉంటే… చడీచప్పుడు లేకుండా…ఏ ఒక్కరికీ తెలియకుండా స్వరూపానందుడు విశాఖను వదిలేసి ఎంచక్కా హిమాలయాలకు చెక్కేసేవారేమో. అదే జరిగి ఉంటే… స్వరూపాందుడి జాడ  గల్లంతు అనే వార్తలు కూడా చూడాల్సి వచ్చేదేమో.

Related posts

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

Satyam NEWS

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

Leave a Comment