కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని విశాఖ ప్రజలు స్వాగతిస్తున్నారు. తాము కేంద్రం విధించిన షరతులన్నీ పాటిస్తామని విశాఖ ప్రజలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జిల్లాలో 144 సెక్షన్ తో పాటు అంతర్ జిల్లా రాకపోకలపై నిషేధం విధించారు.
మెడ్ టెక్ జోన్, పవర్ కంపెనీలు తప్ప మిగతా కంపెనీలు అన్నీ మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు 5 గురు కంటే ఎక్కువ గుంపుగా ఉంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. రైతు బజార్లు తెరుచుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చకున్నారు.
ప్రజలు ఎవరైనా నిత్యావసర సరకుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ 180042500002 ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు కూడా అప్రమత్తమైనారు. ప్రస్తుతం చెస్ట్ ఆసుపత్రి లో 12 అనుమానిత కేసులు ఉన్నాయి.