28.7 C
Hyderabad
April 24, 2024 04: 01 AM
Slider విజయనగరం

విజయనగరం రూరల్ పోలీసులకు పట్టుబడ్డ స్టూవర్టుపురం దొంగలు…!

#Stuvertupuram Thieves

అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “స్టూవర్టుపురం దొంగలు’..సినిమాలో మాదిరిగా విజయనగరం రూరల్ పోలీసులు…. స్టూవర్టుపురం దొంగలను పట్టుకున్నారు. వాళ్ల ఎంఓ తెలిస్తే షాక్ తినాల్సిందే.దృష్టి మరల్చడం అవసరమైతే ఖతం చేయడం. సరిగ్గా ఇలా నే విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో గల ద్వారపూడి గ్రామ శివార్లలో లే అవుట్ డోలా పాపుడు అనే వ్యక్తిని ఈ నెల 4 వ తేదీన ఇద్దరు వ్యక్తులు బెదిరించి, స్కూటీ డిక్కీలో గల కోటి పది లక్షల నగదు, చెక్ బుక్, ఇంటి తాళాలు, ల్యాండ్ డాక్యుమెంట్లును తీసుకొని పరారయ్యారు. వెంటనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ దీపికా ఆదేశాలతో రూరల్ సీఐ తిరుపతి రావు… రంగంలో కి దిగి..

దర్యాప్తు చేసి… పోయిన నగదు తో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు.వారి వద్ద నుండి స్కూటీ, స్ప్లెండర్ మోటారు సైకిలు, 5 సెల్ ఫోన్లు, నగదు రికవరీ చేసినట్లుగా విజయనగరం రూరల్ సీఐ టివి తిరుపతిరావు వెల్లడించారు.

ఈ కేసును చేధించుటకు విశేషంగా కృషి చేసిన రూరల్ ఎస్ఐ గణేష్,ఏఎస్ఐ త్రినాథ్, కానిస్టేబులు షఫీ లను ఆయన అభినందించారు.

Related posts

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

Satyam NEWS

చెత్తరహిత డివిజన్ గా మల్లాపూర్ ను తీర్చిదిద్దాలి

Satyam NEWS

జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు కు సన్మానం

Satyam NEWS

Leave a Comment