36.2 C
Hyderabad
April 23, 2024 20: 53 PM
Slider ప్రత్యేకం

ప్రభుత్వ ఫించన్ పంపిణీ స్వాహా..! వలంటీర్లపై వేటు..!

#Vijayanagaram collector

విద్యల నగరంగా భాసిల్లిన విజయనగరం జిల్లా కే ఇదో మాయని మచ్చ.జగన్ ప్రభుత్వం నియమించిన వలంటీర్లే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఫించన్ సొమ్మును స్వాహి చేసారు.ఆలస్యంగా తెలుసుకున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చేసిన విచారణ లో తేలడంతో లక్షకు పైగా స్వాహా చేసినట్లు నిర్థారణ కావడంతో వారందరినీ తొలగించినట్టు కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం ఫించ‌ను భ‌రోసా ప‌థ‌కం కింద వృద్దులు, వితంతువుల‌కు ఇస్తున్న ఫించ‌ను మొత్తాల పంపిణీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు అధికారులు. ఈ మేరకు జిల్లాలో ని గ‌రివిడి మండ‌లం బొండ‌ప‌ల్లిలో స‌చివాల‌య డిజిట‌ల్ అసిస్టెంట్‌, న‌లుగురు గ్రామ వ‌లంటీర్ల‌ను విధుల నుంచి తొల‌గించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు.

తొల‌గించిన ఐదుగురిపై ప్ర‌భుత్వ ఫించ‌ను మొత్తాల పంపిణీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డి నిధులు స్వాహా చేసినందుకు గాను క్రిమిన‌ల్ చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. గ‌రివిడి మండ‌లం బొండ‌ప‌ల్లిలో ఫించ‌న్ల పంపిణీలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, మ‌ర‌ణించిన ఫించ‌ను దారుల పేర్ల‌తో మంజూరైన ఫించ‌న్ల సొమ్మును డిజిట‌ల్ అసిస్టెంట్ రేగాన శ్రీ‌రామ్‌, గ్రామ వ‌లంటీర్లు దాస‌రి రాంబాబు, గొట్టాపు శంక‌ర‌రావు, ఎల్‌.శ్రీ‌నివాస‌రావు, ఎస్‌.హేమ‌ల‌త క‌ల‌సి డ్రా చేసి దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారి రామ‌చంద్ర‌రావు జ‌రిపిన ప్రాథ‌మిక విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయ్యింద‌ని, ఈ నివేదిక ఆధారంగా వారంద‌రిపై చ‌ర్య తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఈ ఐదుగురూ క‌ల‌సి లక్షా 47 ల‌క్ష‌లు ఫించ‌న్ల సొమ్మును దుర్వినియోగం చేసి డ్రా చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింద‌న్నారు.

బొండ‌ప‌ల్లి కి చెందిన న‌ల్ల‌బోలు రామారావు, బుద్ద‌రాజు ర‌మ‌ణ‌మ్మ‌, కొన్నా ల‌క్ష్ము, తామాడ త‌వుడ‌మ్మ‌, బొత్స తాత‌, క‌లిశెట్టి సూర‌మ్మ‌, పొట్నూరు భాగ‌య్య‌, పెరుమాలి తాత‌య్య‌, గొట్టాపు సోములు త‌దిత‌ర తొమ్మిది మంది ఫించ‌న‌ర్ల‌కు చెందిన సొమ్ము వారి మ‌ర‌ణానంత‌రం కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేష‌న్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా, వ‌లంటీర్ లాగిన్ ద్వారా చెల్లించిన‌ట్లు చూపించి స్వాహాకు పాల్ప‌డిన‌ట్లు నిర్ధార‌ణ జ‌రిగింద‌ని పేర్కొన్నారు.న‌ల్ల‌బోలు రామారావు అనే వృద్ధుడు 2020 ఆగ‌ష్టులో మ‌ర‌ణించగా ఆయ‌న‌కు చెందిన తొమ్మిది నెల‌ల ఫించ‌ను మొత్తం 45,000 డ్రా చేశార‌ని, ఇందులో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి 10 వేలు, వ‌లంటీర్ లాగిన్ నుంచి 35 వేలు డ్రా చేశార‌ని నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు.

బూద‌రాజు ర‌మ‌ణ‌మ్మ అనే ఫించ‌నుదారు సెప్టెంబ‌రు 2020లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరు చేసిన‌ 9 నెల‌ల ఫించ‌ను మొత్తం20 వేల 250ను 6వేల 750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా,13వేల 500 వ‌లంటీర్ లాగిన్ ద్వారా డ్రా చేశార‌ని పేర్కొన్నారు.కొన్న ల‌క్ష్ము అనే ఫించ‌నుదారు ఏప్రిల్ 2021లో మ‌ర‌ణించ‌గా ఆయ‌న‌కు మంజూరైన‌ 3 నెల‌ల ఫించ‌ను మొత్తం 6వేల 750ను వ‌లంటీర్ లాగిన్ ద్వారా డ్రా చేసిన‌ట్లు తేలింద‌న్నారు.

తామాడ త‌వుడ‌మ్మ‌, అనే ఫించ‌నుదారు జూలై 2020లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరైన‌ ప‌ది నెల‌ల ఫించ‌ను మొత్తం 22 వేల 250లు 4వేల500 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో,17 వేల 750 వ‌లంటీర్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు.బొత్స తాత అనే ఫించ‌నుదారు జూలై 2020లో మ‌ర‌ణించ‌గా అత‌నికి మంజూరైన‌ ప‌ది నెల‌ల ఫించ‌ను మొత్తం 22 వేల 250ల‌లో 4500 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో, 17వేల 750 వ‌లంటీర్ లాగిన్‌తో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు.

క‌లిశెట్టి సూర‌మ్మ అనే ఫించ‌నుదారు మార్చి 2021లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరైన‌ మూడు నెల‌ల ఫించ‌ను మొత్తం 6 వేల750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు.పొట్నూరు భాగ‌య్య అనే ఫించ‌నుదారు మార్చి 2021లో మ‌ర‌ణించ‌గా అత‌నికి మంజూరైన‌ మూడు నెల‌ల ఫించ‌ను మొత్తం 6వేల750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు.పెరుమాలి తాత‌య్య అనే ఫించ‌నుదారు జ‌న‌వ‌రి 2021లో మృతి చెంద‌గా అత‌నికి మంజూరైన‌ ఐదు నెల‌ల ఫించ‌ను సొమ్ము 11,250లు వ‌లంటీర్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు.గొట్టాపు సోములు అనే ఫించ‌ను దారుడు ఏప్రిల్ 2021లో మృతి చెంద‌గా అత‌నికి మంజూరు చేసిన రెండు నెల‌ల ఫించ‌ను మొత్తం 6000 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ తో డ్రా చేసిన‌ట్లు నిర్ధార‌ణ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

Related posts

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

Bhavani

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

యువగళం సభతో ఉలిక్కిపడ్డ తాడేపల్లి ప్యాలెస్‌

Satyam NEWS

Leave a Comment