40.2 C
Hyderabad
April 19, 2024 16: 09 PM
Slider ముఖ్యంశాలు

ఓటర్ గుర్తింపుకార్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి

#voterID

స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా ఇప్పటి వరకు ఓటర్ గుర్తింపు కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే  విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను సూచించారు.  శనివారం ఉదయం స్పెషల్ సమ్మరి రివిజన్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్ల తో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారం 6 ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుల కై జిల్లాలో వచ్చిన దరఖాస్తులను బూత్ లెవల్ అధికారుల ద్వారా పరిశీలన జరిపించి అర్హులైన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఇప్పటికే గుర్తింపు కార్డు ఉండి మార్పు చేర్పులకు వచ్చిన దరఖాస్తులు అదేవిధంగా మరణించిన వారి పేర్లను నిబంధనలు పాటిస్తూ ఎన్ రోల్ మెంట్ జాబితా నుండి తొలగించాలన్నారు.

ఈ.వి.యం గోదాములను పరిశీలిస్తూ ఉండాలని, కొత్తగా నిర్మితమైన గోదాములకు మార్చాలని సూచించారు.  ఎక్కడైనా ఇంకా ఇ వి.యం గోదాముల నిర్మాణం పూర్తి కాకుంటే త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆక్టివిటీలను చేపట్టాలని తెలియజేసారు.  ఎలక్షన్ నిధులపై సమీక్ష నిర్వహించారు. 

వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1757 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వారం రోజుల్లో పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు.  అనంతరం ఆర్డీఒలతో మాట్లాడుతూ  ఓటరు గుర్తింపు కార్డు కై ఇప్పటి వరకు వచ్చిన  ఫారం-6  దరఖాస్తులను  వారం రోజుల్లో పరిష్కరించాలని  ఆర్.ఓ లను ఆదేశించారు. 

బి.యల్.ఓ లకు వచ్చిన నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యిందా లేదా అని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించడమ్ పెండింగ్ ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఫారం 6, 6ఏ, 7 లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  స్వీప్ యాక్టివిటి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డి.ఈ.ఓ ను సూచించారు.

Related posts

జస్టిస్ ఫర్ దిశ: తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం

Satyam NEWS

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఏఐటియుసి నిరసన

Satyam NEWS

పార్టీ విలీనంపై సెప్టెంబరు 30లోపు నిర్ణయం

Bhavani

Leave a Comment