31.7 C
Hyderabad
April 24, 2024 23: 05 PM
Slider మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

#collector

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ. తేదీలలో నిర్వహించే శిబిరాల ద్వారా 18 సం.లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మైనారిటీ బాలికల కళాశాల, బండార్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్  పోలింగ్ బూత్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సలు నిండిన యువతి, యువకులను,  దివ్యాంగులను ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా  నమోదు చేయాలని ఆమె సూచించారు.

ఫామ్ – 6 ద్వారా నూతన ఓటర్లను నమోదు చేయాలని, ఫామ్ 6(బి), ఫామ్ – 7, ఫామ్ – 8 ద్వారా ఓటర్ల జాబితా వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఆమె వివరించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, సర్వే ద్వారా ఓటర్ నమోదు చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని ఆమె తెలిపారు. ఓటర్ శిబిరాల వద్ద బూత్ లెవెల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులకు ఆమె సూచించారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి, 100 శాతం నమోదు పూర్తి చేయాలని ఆమె తెలిపారు.

జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దార్ రాజేందర్ గౌడ్,  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కూరగాయలు పంచిన అమెరికా వైసీపీ డాక్టర్ల బృందం

Satyam NEWS

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స

Bhavani

గర్భస్రావం చేయించుకున్నందుకు ఆగ్రహం: భార్యను హత్య చేసిన భర్త

Satyam NEWS

Leave a Comment